ఎదురు చూసిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఊహించిన దాని కంటే కాస్త ఆలస్యంగా పోలింగ్.. ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. డిసెంబరులో ప్రభుత్వం కొలువు తీరాలని కేసీఆర్ భావిస్తే.. అది కాస్త డిసెంబరు మూడో వారంలో ప్రభుత్వం కొలువు తీరే పరిస్థితి.
షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి పోలింగ్ పూర్తి కావటానికి రెండు నెలలకు పైనే గడువు ఉండటం.. అంత కాలం భావోద్వేగాన్ని మొయింటైన్ చేయటం ఇప్పుడు కేసీఆర్ కు పెద్ద టాస్క్ గా చెప్పక తప్పదు. పోల్ మేనేజ్ మెంట్లో ఆరితేరిన కేసీఆర్.. ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినంతనే.. వెంటనే రంగంలోకి దిగారు.
ఫోన్ పట్టుకొని పార్టీ ముఖ్యనేతలకు స్వయంగా ఫోన్లు చేయటం మొదలెట్టారు. ప్రచారం జరుగుతున్న తీరుతో పాటు.. రాబోయే రోజుల్లో ప్రచారాన్ని ఎలా నిర్వహించాలన్న సలహాలు.. సూచనలు ఇవ్వసాగారు. ఇప్పటికే ప్రకటించిన 105 మంది అభ్యర్థులకు సంబంధించి అసంతృప్తులు ఎవరెవరు ఉన్నారు? వారిని ఎలా బుజ్జగించాలన్న అంశంపై ఇప్పటికే దృష్టి సారించిన గులాబీ అధినేత.. అసంతృప్తుల లిస్ట్ ఎంతవరకూ వచ్చిందన్న వాకబు చేశారు.
అసంతృప్తులు ఇప్పటికి ఉండే వాటిని తొలగించాలన్న సూచనతో పాటు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో మాట్లాడిన కేసీఆర్.. తన ప్రచారానికి సంబంధించిన ప్లాన్ ను ఖరారు చేశారు.
ఈ నెలలో రోజుకు రెండు సభలు చొప్పున నిర్వహించాలని.. నవంబరులో రోజుకు మూడు సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే.. దాదాపుగా అన్నినియోజకవర్గాల్ని ఒకటికి రెండుసార్లు కవర్ చేయటం మాత్రమే కాదు.. జిల్లాలను పలుమార్లు సందర్శించినట్లు అవుతుందన్న అంచనా వేస్తున్నారు.
వీలైనంత ఎక్కువగా ప్రజల్లో ఉండటం.. వారి మనసుల్ని తనకు తగ్గట్లుగా మార్చుకోవటమే పెద్ద టాస్క్ గా భావిస్తున్నారు. అందుకే.. తాను వీలైనన్ని ఎక్కువ మీటింగుల్లో పాల్గొనాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడే సమయానికి దసరా.. దీపావళితో పాటు..కీలకమైన పర్వదినాలు ఉన్నందున.. ఆ రోజుల్లో ప్రచారం చేయలేని నేపథ్యంలో.. అందుకు తగ్గట్లే టూర్ ప్లాన్ ను డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు. వారాల తరబడి ప్రజలకు కనిపించని కేసీఆర్.. ఎన్నికల పుణ్యమా అని రానున్న రెండు నెలల వ్యవధిలో రోజుకు రెండు నుంచి మూడు సార్లు సభల రూపంలో కేసీఆర్ దర్శన భాగ్యమే కాదు.. ఆయన మాటలు వినే అదృష్టం దక్కుతుందని చెప్పక తప్పదు.