తెలంగాణ రాష్ట్రసమితి అధినేత ఏ పని మొదలు పెట్టినా దాని వెనుక అర్థం పరమార్థం ఏదో ఉంటుందని టీఆర్ ఎస్ శ్రేణులు చెబుతుంటాయి. పక్కా ప్లాన్ తోనే కేసీఆర్ అడుగులు వేస్తుంటారు. తాజాగా కేంద్రంలో బీజేపీయేతర - కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ కోసం పట్టుదలతో దక్షిణాది పర్యటనకు బయలు దేరారు. ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు.
అందులో భాగంగా కేరళ సీఎం - కమ్యూనిస్టు నేత పినరయి విజయన్ తో కేసీఆర్ కీలక చర్చలు జరిపినట్టు తెలిసింది. 1996 ఫార్ములా గురించే కేసీఆర్ చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. 1996లో దేశంలో హంగ్ వస్తే దక్షిణాదికి చెందిన దేవెగౌడను ప్రధాని సీట్లో కూర్చుండబెట్టారు. ఇప్పుడు ఇదే ప్లాన్ ప్రకారం ఈ ఎన్నికల్లోనూ హంగ్ వస్తే దక్షిణాది నేతను ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టాలనేదే కేసీఆర్ అసలు సిసలు ప్లాన్ అంట..
సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ ఇదే విషయం మాట్లాడారంట.. ఇక ఈనెల 13వ తేదీన డీఎంకే నేత స్టాలిన్ తో భేటిలోనూ దక్షిణాది నుంచి ప్రధాని అభ్యర్థిని చేయాలనే ఒకే ఒక అంశం ఎజెండాగా కేసీఆర్ ముందుకెళ్తున్నట్టు సమాచారం. అయితే ప్రధాని అయ్యే ఆ నాయకుడి పేరు మాత్రం కేసీఆర్ వెల్లడించలేదని తెలిసింది.
మే 23వ తేదీ తర్వాత ఏమైనా జరగొచ్చు. కేంద్రంలో హంగ్ రావచ్చు. కేసీఆర్ - జగన్ - స్టాలిన్ - కుమారస్వామిలు కీలకంగా మారవచ్చు. అందుకే నలుగురు దక్షిణాది నేతలు కలిసికట్టుగా ఉంటే ఇక్కడి నేతనే ప్రధానిగా చూడొచ్చని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. గతంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు కరుణానిధి సై అన్నారు. కానీ ఆయన చనిపోయాక స్టాలిన్ మాత్రం కాంగ్రెస్ వెంట నడుస్తున్నారు. ఈ నెల 13న కేసీఆర్ స్టాలిన్ తో చర్చలు జరుపుతారు. ఆయన ఓకే అంటే కేసీఆర్ ప్లాన్ కార్యరూపం దాల్చే అవకాశాలుంటాయి.