కోదండరాంపై కేసీఆర్ నయా స్కెచ్

Update: 2018-10-25 15:30 GMT
కోదండరాం విషయంలో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారా? లేదా కూటమిని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అనేది అంతుపట్టని విషయంగా మారింది. టీఆర్ఎస్ శ్రేణులకు కోదండరాం విషయంలో చేసిన దిశానిర్దేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కూటమిలో ప్రధాన భూమిక పోషిస్తున్న ఆ పార్టీ నేతల విషయంలో ఎలా వ్యవహరించాలో గులాబీదళం తేల్చుకోలేకపోతున్నారట.

‘‘కోదండరాంను ఏమనొద్దు.. వదిలేయండి మాతో కలిసి ఉన్నప్పుడు ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం, హోదా ఇచ్చాం... దూరంగా వెళ్లిన తరువాతే విమర్శలు చేశాం.. ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నారు. మేము చేసింది ఏమి లేదు.. ’’ అని అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంపై టీఆర్ ఎస్ నేతలు - కార్యకర్తలకు కేసీఆర్  పరోక్షంగా సంకేతాలిచ్చారట. ఈ వ్యాఖ్యల పరమార్ధం ఏమిటి? ఎలా వ్యవహరించాలి అని కేసీఆర్ శ్రేణులు తర్జభర్జన పడుతున్నారట.

ఈ సంకేతాలపై ఒక్క టీఆర్ ఎస్ శ్రేణులే కాదు.. అటు టీజేఎస్ కార్యకర్తలు కూడా తీవ్రంగా చర్చించుకుంటున్నారట. కోదండరాం విషయంలో ఈ పాజిటివ్ వేవ్స్ ప్రజల్లోకి పంపడం వల్ల ప్రయోజనం ఏంటనే అంశాలను విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత కోదండరాం విషయంలో కేసీఆర్ అవలంబించిన వైఖరి అందరికీ తెలిసిందే. ఒకొనొక సమావేశంలో కోదండరాంను కేసీఆర్ అనరాని మాటలు అన్నారు. అప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా హాట్ టాపిగ్గా మారాయి.

మహా కూటమి ఏర్పడ్డాక కోదండరాం పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఆయన అనుకున్న సీట్లు రాకపోయినా, ఉద్యమ నేపథ్యం ఉండటంతో చాలా మంది ఆయనను అంటిపెట్టుకొని ఉన్నారు. కేసీఆర్, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకునేందుకు పెద్దగా కష్ట పడటం లేదు. సీట్ల సర్దుబాటు ముగిసిన తరువాత ప్రచారంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇటువంటి తరుణంలో కేసీఆర్ కోదండరాం విషయంలో పార్టీ శ్రేణులకు చేసిన నిర్దేశం సంచలనంగా మారింది. ఆయనుకున్న ఇమేజ్ తో టీఆర్ ఎస్ కు నష్టం జరగవద్దనే ఇలా విమర్శలకు దూరంగా ఉండాలని సూచించారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కోదండరాంను తిట్టడం కంటే ఊరుకుంటేనే లబ్ధి పొందవచ్చనే   కొత్త ఎత్తుగడను కేసీఆర్ అమలు చేస్తున్నట్టు సమాచారం. 
Tags:    

Similar News