కేసీఆర్ 'ముందస్తు' ప్లాన్.. 6 నెలల్లో ఎన్నికలు?

Update: 2022-11-28 07:32 GMT
తెలంగాణలో కేసీఆర్ మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.  2018 డిసెంబర్ లోనూ సడెన్ గా ముందస్తుకు వెళ్లి కేసీఆర్ గెలిచారు. ఇప్పుడు వెళ్లను అని అంటున్నారు. కానీ కాదంటే ఔననే అర్థాలే రాజకీయాల్లో వస్తాయి. ఆ లీడర్లు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే ఇదే డౌట్ రాకమానదు. కేసీఆర్ వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలను డీకోడ్ చేస్తే ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళుతున్నట్టు అర్థమవుతోంది.

ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండడంతో కేసీఆర్ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు, సొంత జాగాలో నివాసాలు, ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయం ప్రారంభం, దళితబంధు లాంటి పలు అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వచ్చే ఏడాది మార్చిలోగా రోడ్లను మెరుగ్గా తీర్చిదిద్దేలా కాంట్రాక్టులు పిలుస్తున్నారు. సచివాలయం పనులు చివరిదశకు చేరుకోవడంతో సంక్రాంతికి ప్రారంభించనున్నారు. అమరుల స్మారకాన్ని అదే రోజు ప్రారంభిస్తారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మెట్రో విస్తరణకు శంకుస్థాపన చేయబోతున్నారు.

ఇక పెండింగ్ పనులు.. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత తగ్గించుకోవాలని చూస్తున్నారు. అసెంబ్లీలో ప్రకటించిన 80వేల ఉద్యోగాల భర్తీలో వేగం పుంజుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే పలు నోటీఫికేషన్లు ఇచ్చారు. పరీక్షలు నడుస్తున్నాయి.

తాజాగా మరో 9వేల ఉద్యోగాలతో గ్రూప్4 నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దీంతో నిరుద్యోగులంతా బిజీగా ఉన్నారు. మార్చి వరకూ నియామకాల జోరు కొనసాగే అవకాశం ఉంది.

డిసెంబర్ మొదటి వారం నుంచి సీఎం జిల్లాల పర్యటన సందర్భంగా భారీ బహిరంగ సభలు కూడా జరుగుతాయి. డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్ పై కేంద్రం విధిస్తున్న ఆంక్షలు, తదితరాలపై చర్చించనున్నారు. కేంద్రం కక్షపూరిత వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

ఇక ఎమ్మెల్యేలు అంతా ప్రజల్లోనే ఉండాలని.. విభేదాలు పక్కనపెట్టి ఆత్మీయ సమావేశాలు పెట్టుకోవాలని కేసీఆర్ సూచిస్తున్నారు. వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్ చార్జీల కోసం జాబితాల రూపకల్పన చేపడుతున్నారు.

ఈసారి ఫిబ్రవరిలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాక అసెంబ్లీని రద్దు చేయవచ్చని చెబుతున్నారు. వచ్చే ఏడాది మే లోపు ఎన్నికలు జరపాలని చూస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అదే టైంలో జరుగుతాయి. ఆలోపే పూర్తి చేసి గెలిచి ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. చూడాలి మరీ ఏం జరుగుతుందో..



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News