తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తరహాలోనే తమ పోలీస్ బాస్ ఎంపికను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఏపీలో జేవీ రాముడు రిటైర్ అయ్యాక రాష్ట్ర ఇన్ చార్జి డీజీపీగా ఎన్.సాంబశివరావును అక్కడి టీడీపీ ప్రభుత్వం నియమించింది. అనంతరం పూర్తి స్థాయి బాధ్యతలు ఇస్తు కొత్త డీజీపీని ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా యూపీఎస్ సికి సాంబశివరావుతో పాటు మరో నలుగురు అర్హులైన డీజీపీల పేర్లను అక్కడి సర్కారు పంపించింది. అయితే కేవలం మూడు నెలలు మాత్రమే సర్వీసు ఉన్న సాంబశివరావు పేరును జాబితాలో ఎలా చేరుస్తారంటూ యూపీఎస్ సీతో పాటు కేంద్ర హోంశాఖ అభ్యంతరాలు చెబుతూ ఆ జాబితాను తిరిగి పంపించి వేశాయి. కేంద్రం తీసుకున్న ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు ప్రభుత్వం సాంబశివరావును తమ పూర్తి స్తాయి డీజీపీగా నియమించుకోవడమే గాక డీజీపీని నియమించుకునే అధికారానికి సంబంధించిన చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. సరిగ్గా అదే రీతిలో రాష్ట్ర డీజీపీ ఎంపికకు సంబంధించి ఇకపై కేంద్ర ప్రభుత్వ పెత్తనానికి చెల్లుచీటి పలికే నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్.
రాష్ట్ర ఐపీఎస్ అధికార వర్గాల సమాచారం ప్రకారం పోలీసు బాస్(డీజీపీ)ని ఎంపిక చేసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ సర్కార్ తీసుకు వస్తున్న చట్టం త్వరలోనే అమలులోకి రానుంది. దీనికి సంబంధించిన బిల్లును ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టారు. అలాగే శాసనమండలిలోనూ ప్రవెశపెట్టి ఆమోదింప చేసుకుని చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. డీజీపీ ఎంపికకు సంబంధించి గత ప్రభుత్వాలు సీనియార్టీని పక్కన బెట్టి జూనియర్ అధికారులను నియమిస్తూ రావడం, దీనిపై కేంద్ర అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్(సీఏటీ)లో సీనియర్‌లు సవాల్ చేయడం వంటి ఘటనలు అనేకం గతంలో చోటు చేసుకున్నాయి.
మరోవైపు పోలీసు శాఖలో తీసుకు రావాల్సిన సంస్కరణలపై రెబిరో - పద్మనాభయ్య తదితర కమిటీలు చేసిన సిఫారసులను అమలు చేయాలంటూ దాదాపు పదేండ్ల కితం పంజాబ్ మాజీ డీజీపీ ప్రకాశ్ సింగ్ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో పలు సంస్కరణలను అమలు చేయాలంటూ రాష్ట్రాలకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే డీజీపీల ఎంపికకు సంబంధించి సీనియార్టీకి సంబంధించి వస్తున్న వివాదాలపై అన్ని రాష్ట్రాల నుంచి అబిప్రాయాలను ఆ సమయంలో న్యాయస్థానం కోరింది. ఈ నేపథ్యంలోనే డీజీపీ ఎంపికకు సంబంధించి స్టేట్ సెక్యూరిటీ కమిషన్(ఎస్ ఎస్ సీ) ను ఏర్పాటు చేసుకోవాలని ఆ సమయంలో సూచించింది.
అంతేగాక ఎస్ ఎస్ సీలో ఆయా రాష్ర్టాల సీఎంలు - సీఎస్ తోపాటు ప్రతిపక్ష నాయకుడిని కూడా సభ్యుడిగా చేర్చాలని పేర్కొంది. దీనిపై ఆయా రాష్ట్రాల నుంచి అనుకూల - ప్రతికూల స్పందనలు వచ్చాయి. తర్వాత కొత్త డీజీపీ ఎంపిక విషయంలో అర్హులైన ఐదు నుంచి ఆరుగురు డీజీపీ స్థాయి అధికారుల పేర్లు - వారి బయేడేటా - సమర్థత - అనుభవాలను వివరిస్తు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్ సీ)కి ప్రతిపాదనలను పంపించాలని, అందులో నుంచి ముగ్గురు అర్హులైన డీజీపీల పేర్లను యూపీఎస్పీ ఎంపిక చేసి రాష్ట్రానికి పంపిస్తుందని, అందులో నుంచి ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి ఈ విధానాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ వస్తున్నాయి. అయితే శాంతి భద్రతల పరిరక్షణ రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని - కావున ఈ కీలక బాధ్యతలను పర్యవేక్షించే పోలీసు బాస్(డీజీపీ)ని నియమించుకునే అధికారం రాష్ట్రాలకే ఉండాలనే బలమైన వాదన అప్పటి నుంచి దాదాపుగా అన్ని రాష్ట్రాలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే డీజీపీల నియామకానికి సంబంధించి రాష్ట్రాలు చట్టం తీసుకు రావడం ఆ్వరా ఆ అధికారాన్ని తీసుకోవాలని కూడా సుప్రీం స్పష్టం చేసిందని సమాచారం. కాగా రాష్ట్రంలో అనురాగ్ శర్మ గతేడాది నవంబర్ లో రిటైర్ అయ్యాక 1986 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి మహేందర్ రెడ్డిని డీజీపీ కో ఆర్డినేషన్ తో పాటు రాష్ట్ర డీజీపీ బాధ్యతలను అదనంగా అప్పగిస్తు టీఆర్ ఎస్ ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి పూర్తి స్థాయి డీజీపీ నియామకానికి సంబంధించి యూపీఎస్ సీకి అర్హులైన డీజీపీల జాబితాను పంపించే అంశాన్ని సర్కారు పరిశీలనలోనే ఉందని తెలిసింది.
మరోవైపు ఏపీలో డీజీపీ ఎంపికకు సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ వచ్చిన రాష్ట్ర సర్కారు ఇక్కడ కూడా డీజీపీ నియామక అధికారాన్ని సొంతం చేసుకుంటూ చట్టాన్ని తీసుకు వచ్చే దిశగా అడుగులు వేసింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో ఈ చట్టానికి సంబంధించిన బిల్లును సర్కారు ప్రవేశ పెట్టిందని - ఇక శాసనమండలిలో కూడా ఈ బిల్లుపై ఆమోదం పొంది చట్టం తీసుకు రావడమే ఆలస్యమని సీనియర్ ఐపీఎస్ వర్గాలు తెలిపాయి. ఈ విధమైన చట్టాన్ని దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలు తీసుకు వచ్చాయని, మనమే చివరి వాళ్లమయ్యామని వారు అన్నారు. దీంతో ఇకపై కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండానే రాష్ట్ర డీజీపీని ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాధినేతకు దక్కుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.