"రాహుల్ వచ్చిండా?".. "మేము బెస్ట్ ఫ్రెండ్స్".. "ఇగో రాహుల్... ఎక్స్‌ట్రాలు ఎందుకయ్యా?" .. "రాహుల్ మోడీ చూడాలంటే ఈ వార్త ఇంగ్లిష్ నువ్వు బాగా రాయాలె".. "ఏమయ్యా రాహుల్... ఇది కరెక్టా..?".. "ప్లీజ్ ఆన్సర్ మీ రాహుల్".... ప్రగతి భవన్ లో జరిగే ప్రెస్ మీట్ లలో ది హిందూ జర్నలిస్టు రాహుల్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ సంభాషణలివి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారంటే... ఆ ప్రెస్ మీట్ లో ఒకటికి నాలుగుసార్లు రాహుల్ పేరు ఎత్తకుండా ఉండరు కేసీఆర్. యూట్యూబ్ లో కేసీఆర్ ప్రెస్ మీట్ వీడియోలకు "కేసీఆర్ - రాహుల్" పేరున థంబ్ నైల్స్ పెడుతుంటారంటే అర్ధం చేసుకోవచ్చు ఈ కాంబినేషన్ ఎంత హాట్ టాపిక్కో.
పైగా ఈ వీడియోల క్రింద పెట్టే కామెంట్స్ లో సైతం... "కేసీఆర్ - రాహుల్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్" అంటూ కామెంట్లు కనిపిస్తుంటాయంటే... జనాల్లో ఈ "రాహుల్" అనేపేరు ఎంతగా ప్రాచుర్యంలోకి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక కోవిడ్ సమయంలో అయితే ఈ కాంబినేషన్ మరింత ఎంటర్ టైన్ మెంట్ క్రియేట్ చేసేది. లాక్ డౌన్ టైంలో కేసీఆర్ తరచుగా ప్రెస్ మీట్ లు నిర్వహిస్తూ ఉండేవారు. ఆసమయంలో జర్నలిస్ట్ రాహుల్ సీఎం కేసీఆర్ ను రకరకాల ప్రశ్నలు అడిగేవారు. ఈ సమయంలో రాహుల్ ప్రశ్నలకు కోపం వచ్చినా, చికాకొచ్చినా కూడా కేసీఆర్ లాజికల్ గానే సమాధానం చెప్పే ప్రయత్నం చేసేవారే తప్ప... హావబావాల్లో ఆగ్రహం కనబడనిచ్చేవారు కాదు.
అయితే కేసీఆర్ ప్రెస్ మీట్లతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన "ది హిందు" ఇంగ్లిష్ పత్రికలోని ఈ జర్నలిస్ట్.. తాజాగా పదవీ విరమణ చేశారు. మీడియా రంగంలో దాదాపు మూడు దశాబ్దాలు సేవలందించిన ఈ జర్నలిస్ట్ చివరి పనిదినం మే 31. ఈ పత్రికకు సంబంధించి బీఆరెస్స్ పాలిటిక్స్ తో పాటు.. ప్రగతి భవన్ సమాచారాలను రాహుల్ కవర్ చేసేవారు.
అయితే తాజాగా ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో హైదరాబాద్ లో కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదే ప్రగతి భవన్ లో రాహుల్ పాల్గొన్న చివరి ప్రెస్ మీట్ అని తెలుస్తుంది. అంటే... ఇకపై కేసీఆర్ నుండి "రాహుల్" పేరు వినలేమేమో ! అయితే తాజాగా తెరపైకి వచ్చిన తన ఫేవరెట్ జర్నలిస్ట్ రాహుల్ పదవీ విరమణపై కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి! దీనికి తోడు.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కేసీఆర్… రాహుల్ కు ఎలాంటి రిటైర్మెంట్ గిఫ్ట్ ఇస్తారో అనేది ఆసక్తిగా మారింది!