సమ్మె చేయటం పెద్ద విషయం కాదు.. తాము చేసే సమ్మెతో సర్కారుకు చెమటలు పోసేలా చేయటం అందరికి సాధ్యమయ్యేది కాదన్న విషయం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కోర్కెతో సమ్మెను షురూ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు షాకుల మీద షాకులు ఇస్తోంది కేసీఆర్ సర్కారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికి ఏపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంతో.. తాము కాస్త ఒత్తిడి చేస్తే ఆ పని పూర్తి అవుతుందన్న ఆలోచనతో ఆర్టీసీ సమ్మెకు ప్లాన్ చేశారు.
అయితే.. కేసీఆర్ ఎంతటి మొండివాడన్న విషయాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అంచనా వేసే విషయంలో తప్పు చేయటమే కాదు.. తాము సమ్మె చేస్తే దానికి విరుగుడుగా సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయాల్ని తీసుకుంటారన్న విషయంలో యూనియన్ నేతలు ఫెయిల్ అయ్యారు. దీని ఫలితమే.. 48వేల మంది ఉద్యోగుల్ని తీసేసినట్లు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఆ ఖాళీల్ని భర్తీ చేసే పనికి తెర తీయటంగా చెప్పాలి.
అధికారికంగా ఆర్డర్ లేకుండా.. 48వేల ఉద్యోగాలు పోయినట్లుగా చెప్పటమే కాదు.. ఆర్టీసీలో కేవలం 1200 మంది మాత్రమే ఉన్నారంటూ సంచలన ప్రకటన చేసిన కేసీఆర్.. ఇప్పుడు తదనంతర చర్యలకు సిద్ధమవుతున్నారు. తన మాట వినని వారి విషయంలో తానెంత కఠినంగా ఉంటానన్న విషయాన్ని అందరికి తెలియజేసేలా వ్యవహరించాలన్నది గులాబీ బాస్ ప్లానింగ్ గా చెబుతున్నారు.
ఇప్పటికే పెద్ద ఎత్తున బస్సుల్ని రోడ్ల మీదకు తేవటంలో విజయం సాధించి.. కార్మికుల్లో నిరాశను పెంచేలా చేసిన ఆయన.. ఇప్పుడు మరో నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు చెబుతున్నారు. సమ్మె కారణంగా తమ ఉద్యోగాల్ని తామే సెల్ప్ డిస్మిస్ చేసుకున్న 48వేల మందికి ప్రత్యామ్నాయంగా ఖాళీల్ని భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్న సంకేతాల్ని పంపుతున్నారు.
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల్లో చీలిక తీసుకురావటం.. ఎలాంటి డిమాండ్లను తీర్చాల్సిన అవసరం లేకుండానే.. సమ్మె నుంచి బయటకు వచ్చేసి.. తాము చేసిన తప్పునకు చెంపలేసుకుంటున్నట్లుగా చెప్పి.. తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు అవసరమైన ఒత్తిడిని నోటిఫికేషన్ రూపంలో తీసుకురావాలన్నది ప్లానింగ్ గా చెబుతున్నారు. అదే జరిగితే.. రానున్న రోజుల్లో సమ్మె చేసేందుకు ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే కాదు.. తెలంగాణ పరిధిలోని ఏ ఉద్యోగ సంఘం ధైర్యం చేసే వీలు లేకుండా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. మరి.. ఆయన అనుకున్నట్లే ఆట సాగుతుందా? అనుకోని మలుపు తిరుగుతుందా? అన్నది కాలం మాత్రమే తేల్చగలదు.