మరో బాదుడుకు కేసీఆర్ రెఢీ.. రూ.2వేల కోట్లు టార్గెట్.. మీ భారం లెక్క ఇదే
అంతకంతకూ పెరిగే సంక్షేమ పథకాలకు అవసరమైన డబ్బుల్ని ప్రభుత్వాలు మాత్రం ఎక్కడి నుంచి తెస్తాయి. అయితే.. అప్పులు చేయటం.. లేదంటే ఆస్తులు అమ్మటం మాత్రమే కాదు.. సమయం, సందర్భం చూసుకొని పన్ను వాతలు పెట్టేందుకు సిద్ధమవుతుంటాయి ప్రభుత్వాలు. తాజాగా అలాంటి ఆలోచనే చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకు రవాణా శాఖకు సంబంధించిన వసూలు చేస్తున్న పన్నులకు భిన్నంగా సరికొత్త నిబంధనల్ని తీసుకురావటం ద్వారా ఏటా రూ2వేల కోట్లు అదనంగా ఆదాయాన్ని సంపాదించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ బాదుడు సరిపోదన్నట్లుగా వాహనాలు వాడే ప్రతి ఒక్కరి మీదా భారం పడేలా తాజా ప్రతిపాదనలు ఉన్నాయని చెబుతున్నారు.
దీంతో.. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా వాహనం ఉన్న ప్రతి ఒక్కరితో పాటు.. కొత్త వాహనాలు కొనే వారి మీదా భారం పడే వీలుంది. దీనికి సంబంధించిన విధివిధానాలు సిద్ధమయ్యాయని.. సీఎం కేసీఆర్ సంతకం పెట్టి.. ఓకే అంటూ పచ్చ జెండా ఊపేస్తే.. ఈ పన్ను పోటు అందరి మీదా పడుతుందని చెబుతున్నారు. ఏడాదికి రూ.2వేల కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా రవాణా శాఖ ప్రభుత్వానికి పలు ప్రతిపాదనల్ని పంపింది. ఈ ప్రతిపాదనలకు కేసీఆర్ సర్కారు ఓకే అన్న మాట అంటే చాలు.. జేబులకు చిల్లు పడటం ఖాయమని చెప్పక తప్పదు. అదెలానంటే..?
- ఇప్పటివరకు వాహన జీవితకాలం 15 ఏళ్లుగా ఉంచి.. ఆ తర్వాత నుంచి గ్రీన్ ట్యాక్స్ ను వసూలు చేస్తుంటారు. దాని స్థానే వాహన జీవిత కాలాన్ని ఏడేళ్లకు కుదించి.. ఎనిమిదో ఏడు నుంచి గ్రీన్ టాక్స్ పేరుతో బాదేయాలన్నది ఒక ప్రతిపాదనగా చెబుతారు.
- ప్రస్తుతం టూ వీలర్ కు 9 శాతం లైఫ్ ట్యాక్స్ ను వసలూ చేస్తున్నారు. ఒకవేళ ఒకే ఇంట్లో ఒకే పేరు మీద రెండు బైకులు ఉంటే.. మరో రెండు శాతం అదనపు పన్ను చెల్లించాల్సిందే. అదే సమయంలో ఒక వ్యక్తికి టూ వీలర్ ఉండి కారును కొంటే.. దాని మీద 14 శాతం లైఫ్ ట్యాక్స్ ను విదిస్తున్నారు.
- కార్ల విషయానికి వస్తే లైఫ్ ట్యాక్స్ 12 శాతంగా ఉంది. అయితే.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా టూ వీలర్.. కార్ల ధరల ఆధారంగా పన్ను పోటు ఉండేలాప్రతిపాదనలు సిద్ధం చేశారు.
- టూవీలర్ ధర రూ.50 వేలు (ఎక్స్ షోరూం) ఉంటే ప్రస్తుతం అమలు చేస్తున్న 9 శాతం పన్నును కంటిన్యూ చేస్తారు. ఒకవేళ టూవీలర్ ధర రూ.50వేలకు పైన ఉంటే 12 శాతం టాక్సును విధిస్తారు.
- కార్ల విషయానికి వస్తే రూ.5లక్షల లోపు ఎక్స్ షోరూం ధర ఉంటే.. సదరు కారు పై 13 శాతం లైఫ్ టాక్స్ విధించాలని భావిస్తున్నారు.
- రూ.5-రూ.10 లక్షల మధ్య (ఎక్స్ షోరూం) ధర ఉంటే వాటికి 14 శాతం లైఫ్ టాక్స్ విధిస్తారు. రూ.10-రూ.20 లక్షల మధ్య కార్ల ధర ఉండే వాటికి 17 శాతం.. రూ.20 లక్షల కంటే ఎక్కువగా ఉంటే ఆ కార్లకు 18 శాతం చొప్పున లైఫ్ టాక్స్ ను వసూలు చేయాలని ప్రతిపాదన సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ ఈ దస్త్రం మీద సంతకం పెడితే చాలు.. పన్నుపోటు భారీగా పెరుగుతుంది. ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి రూ.2వేల కోట్ల అదనపు ఆదాయం రానుంది. మరేం చేస్తారో చూడాలి.