తప్పులు అందరూ చేస్తారు. కానీ.. కేసీఆర్ చేసే తప్పుల్లోనూ భలే అందం ఉంటుంది. కావాలంటే చూడండి.. ఆయన ఆగ్రహాన్ని చూసినోళ్లంతా ఏం మాట్లాడిండు భయ్ అంటారే కానీ.. మరీ అంత అన్యాయంగా మాట్లాడతాడే అన్న మాటే రాదు. అలా అని.. కేసీఆర్ ఏమన్నా సుకుమారంగా.. సుతారంగా విమర్శలు చేస్తారా అంటే.. అలానూ ఉండదు. బండకేసి బాదినట్లుగా ఉంటుంది.
బరాబర్.. నా ఇష్టం మీకేందన్నట్లుగా ఉంటుందే తప్పించి.. మరోలా ఉండదు. అలా అన్నా కిక్కురమనకుండా ఉండే విపక్షాల్ని చూస్తే.. కేసీఆర్ మాటల్లో ఏదో సమ్మోహనాస్త్రం ఉంటుందనే చెప్పాలి. తెలంగాణ అసెంబ్లీలో విపక్షాల సంఖ్య ఇప్పటికి ఫర్లేదన్నట్లుగానే ఉంది. గట్టిగా మాట్లాడేవాళ్లు.. చక్కటి ట్రాక్ రికార్డులున్నోళ్లు చాలామందే ఉన్నారు. కానీ.. వీళ్లంతా కేసీఆర్ నోటి నుంచి మాట వచ్చే ముందు వరకే.
ఒకసారి కానీ కేసీఆర్ మైక్ పట్టుకొని మాట్లాడటం మొదలు పెడితే ఫ్లాట్ కావాల్సిందే. ఇక్కడ ఫ్లాట్ అన్న మాట ఎందుకంటే.. ఆయనపై ఎక్కి తొక్కాలని తపించే విపక్ష నేతలు సైతం.. ఆయన మాటలకు నోట మాట రాకుండా ఉంటారే తప్పించి.. ఎదిరించి.. ఎదురుదాడి చేసి.. శభాష్ ఏం మాట్లాడిండు అన్నట్లుగా ఉన్నోళ్లు కనిపించరు. అలాంటప్పుడు బలవంతుడ్ని మాత్రం కీర్తించి.. భుజానకెత్తుకునే జనాలే కాదు.. ఆయన్ను వ్యతిరేకించే వారు సైతం.. ఆయన దూకుడు మాటలకు ఫిదా అయిపోతుంటారు. తాజాగా అలాంటి సీనే ఒకటి తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకుంది.
భూములు సర్వే చేసి.. ప్రభుత్వం కొత్తగా ఇచ్చే పాస్ బుక్ ల మీద కేసీఆర్ బొమ్మ వేసుకుంటారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆ విషయాన్ని అసెంబ్లీలో అడిగేశారు. వాస్తవాన్ని చూపించి ప్రశ్నిస్తేనే.. అవును.. అయితే ఏంది? అంటూ ఏసుకునే కేసీఆర్.. భట్టి ఆరోపణకు భారీ మొట్టికాయ ఇచ్చిన చందంగా మాట్లాడేశారు.
కాంగ్రెసోళ్లు.. గాలి దుమారం రేపుదామని మాట్లాడుతున్నరు.. అవును.. కొత్త పాసు పుస్తకాల మీద కేసీఆర్ బొమ్మే పెడ్తం.. లేకపోతే భట్టి విక్రమార్క బొమ్మ పెడతామా? అయినా పాస్ బుక్ ల మీద ఫోటో పెట్టుకుంటేనే పబ్లిసిటీ వచ్చే దుస్థితిలో కేసీఆర్ ఉన్నడా? అంటూ భారీగా కౌంటర్ ఇచ్చేశారు.
కేసీఆర్ బొమ్మ పెడతామంటూనే కాస్త ఆగిన కేసీఆర్.. అయితే మీకేందన్న మాట వస్తే విపక్షాలు మాత్రం ఏం బదులివ్వగలవ్? ఏమైనా మాటలతో తాట తీస్తున్న కేసీఆర్ పుణ్యమా అని కామ్ గా ఉండటమే తప్పించి.. గట్టిగా కౌంటర్ ఇచ్చే వారే కనిపించట్లేదనే చెప్పాలి. అయినా.. పాస్ బుక్ ల మీదనే కేసీఆర్ బొమ్మ వేసుకోవాల్సిన అవసరమేంది? ఆయన బొమ్మను.. ఆయన ఘన చరిత్రను పారాయణం చేయటానికి అనుకూల మీడియా భారీగా ఉన్నప్పుడు ఇలా అనక ఎలా అంటారు చెప్పండి..?