మాట్లాడేవాడే మొనగాడంటూ ఆ మధ్యన వచ్చిన ఒక యాడ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నిజానికి మాట్లాడటానికి మొనగాడితనానికి మధ్య ఉన్న లింకేమిటన్నది పక్కన పెడితే.. ఏ హామీ మీదనైనా.. ఏ టైంలో అయినా మాట్లాడే మొనగాడు కేసీఆర్ గా చెప్పక తప్పదు. తనను అదే పనిగా విమర్శించే వారి విషయంలో ఎంత కఠినంగా ఉంటారో.. తనను లాజిక్ గా తప్పు పట్టే వారిని అంతే లాజిక్ తో దెబ్బ కొట్టే తీరు కేసీఆర్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. ఇందుకు నిదర్మనంగా ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యల్ని చెప్పాలి.
ఎన్నికల సందర్భంగా తానిచ్చిన హామీల్ని నూటికి నూరు శాతం అమలు చేసినట్లుగా చెప్పుకున్న కేసీఆర్ తీరును చాలామందే తప్పు పట్టారు. అన్నింటికి మించి ఇంట్లో నల్లాలో నీళ్లు వచ్చాకే ఓటు అడుగుతా. లేకుండా అడగనని శపధం చేసినట్లుగా నిండు అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్.. తాజా ఎన్నికల వేళకు ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వని వైనాన్ని ప్రశ్నించారు. తాజాగా ఆ విమర్శకు తనదైన రీతిలో సమాధానమిచ్చారు కేసీఆర్.
ఇంటింటికి నీళ్లు ఇచ్చామని తాను ఎప్పుడూ అనలేదని.. ప్రతి ఇంటికినీళ్లిచ్చిన తర్వాతే ఓటు అడుతానని తాను చెప్పినట్లు చెప్పారు. తన టర్మ్ జూన్ మధ్యలో అయిపోవాల్సిందని.. మధ్యలో పిచ్చి వాగుడుతో ప్రజాతీర్పు కోసం ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్న కేసీఆర్.. ఆ లెక్కన చూస్తే..తనకు జూన్ వరకూ టైం ఉన్న విషయాన్ని చెప్పేశారు. ఏమైనా.. మాటలతో మెప్పించటం.. అవుననిపించటం కేసీఆర్ తర్వాతే ఎవరైనా. అందుకే కొందరు అనేది... ఎవడ్రా.. కేసీఆర్ ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోలేదంది. సారుకు జూన్ వరకూ టైముంది. ఆ తర్వాత ఎప్పు డు ఎన్నికలు వస్తే.. నల్లా నీళ్లు ఇవ్వలేదని క్వశ్చన్ చేయాలి కానీ.. ఇప్పుడే అనుడేంది?
నల్లా నీళ్ల విషయంలో తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చిన కేసీఆర్.. కొన్నిసార్లు ఆయన తీరు అప్రజాస్వామికంగా ఉంటుందన్న విమర్శను తాజాగా విలేకరులు అడగ్గా.. దానికి కేసీఆర్ నుంచి వచ్చిన సమాధానాన్ని చదివి తీరాల్సిందే. అవును నేను కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాను. అది మీకు అప్రజాస్వామికంగా అనిపిస్తే నేనేం చేయలేను. నేను కొన్ని విషయాల్లో కఠినంగా ఉండకుంటే.. రూపాయిని కాస్తా పావలాకు అమ్ముతారు. తెల్లారేసరికి ఉంటానా? అంటూ కేసీఆర్ వేసిన రివర్స్ క్వశ్చన్ వింటే.. రానున్న రోజుల్లో ఆయన ఉండే కఠినం ఎలా ఉంటుందన్నది ఆయన ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేస్తుందని చెప్పక తప్పదు.