కేసీఆర్ ను క‌దిలించిన మీడియా సంస్థ‌

Update: 2017-04-20 04:18 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏ మాత్రం చూడ‌ని ప‌త్రిక‌గా చెప్పుకునే జ‌గ‌న్ ప‌త్రిక‌ను.. ఆయ‌న ఎంత‌గా ఫాలో అవుతార‌న్న విష‌యం.. ఆ మ‌ధ్య‌న ఫోటో ద్వారా బాబు దొరికిపోయిన సంగ‌తి తెలిసిందే. త‌న త‌ప్పుల్ని నిత్యం ఎత్తి చూపించే సాక్షిని.. మిగిలిన ప‌త్రిక‌ల కంటే చాలా కేర్ ఫుల్ గా ఆయ‌న ఫాలో అయిన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజా ఉదంతం చూస్తే ఏపీ సీఎం చంద్ర‌బాబే కాదు.. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సైతం చాలా జాగ్ర‌త్త‌గా జ‌గ‌న్ ప‌త్రిక‌ను ఫాలో అవుతార‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది.

రాష్ట్రంలో ఎండ‌లు మండుతున్న వేళ‌.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ఇచ్చింది లేదు. కొన్ని ప్రైవేటు స్కూళ్ల‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో మండే ఎండ‌ల్లోనూ స్కూళ్లా అన్న ప్ర‌శ్న‌ను సంధిస్తూ ఒక క‌థ‌నాన్ని అచ్చేసింది. ఇంత ఎండ‌ల్లో బ‌య‌ట‌కు తిరిగే ప‌రిస్థితే లేని వేళ‌.. పిల్ల‌ల్ని స్కూళ్ల‌కు పంప‌టం స‌బ‌బా? అన్న సందేహాన్ని వ్య‌క్తం చేసింది. ఈ క‌థ‌నాన్ని చ‌దివిన కేసీఆర్‌.. వెంట‌నే స్కూళ్ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించాల‌ని మంత్రి క‌డియం శ్రీహ‌రిని ఆదేశించారు.

అయితే.. అప్ప‌టికే స్కూళ్ల‌కు విద్యార్థులు వెళ్లిపోయి ఉండ‌టంతో ఈ రోజు (గురువారం) నుంచి సెల‌వులు ఇవ్వాల‌న్న ఆదేశాల్ని జారీ చేశారు. మొత్తానికి ఒక మీడియా క‌థ‌నంతో భ‌గ‌భ‌గ‌మంటున్న ఎండ‌ల్లో విద్యార్థులు స్కూళ్ల‌కు వెళ్లే బాధ త‌ప్పింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మీడియా ప‌ట్ల కేసీఆర్ ఎలా వ్య‌వ‌హ‌రించినా.. అందులో వ‌చ్చే వార్త‌ల‌కు మాత్రం స్పందిస్తాన‌న్న విష‌యాన్ని తాజా ఉదంతంతో నిరూపించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. సొంత మీడియా సంస్థ‌లో ఇలాంటి క‌థ‌నాలు రాని వైనాన్ని కేసీఆర్ ఎలా ఫీలై ఉంటారో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News