అధికారుల మాటల్ని ఓపిగ్గా వినటం.. వారికి సూచనలు చేయటం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న అలవాటు. అధికారుల మీద విరుచుకుపడటం.. వారిపై మండిపడటం.. అసహనం వ్యక్తం చేయటం లాంటివి కేసీఆర్ లో పెద్దగా కనిపించవు. అయితే.. అందుకు భిన్నమైన కేసీఆర్ ను చూడటమే కాదు.. ఆయన నోటి వెంట సీరియస్ మాటలు రావటం ఆర్టీసీ అధికారులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తిన పరిస్థితి. తనదైన శైలిలో వివిధ శాఖల్ని రివ్యూ చేసే కేసీఆర్.. తాజాగా ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని 95 డిపోలకు 90 డిపోలు నష్టాల్ని మూటగట్టుకోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. అవసరమైతే.. ఆర్టీసీని మూసేద్దామన్న మాట రావటంతో బిత్తరపోయారు.
అయితే.. అదంతా ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం మీదనే తప్ప ఆర్టీసీని మూసేయాలన్నది కేసీఆర్ ఆలోచన కాదన్న విషయం రివ్యూ సమావేశం జరిగిన తీరును చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణలో ఉన్న 95 డిపోలలో కనీసం సగం డిపోలు అయినా లాభాల్లో నడవాల్సి ఉందని.. కానీ అందుకు భిన్నంగా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించిన ఆయన.. ‘‘అధికారులు ఏం చేస్తున్నారు? ఆర్టీసీనష్టాల్లో ఉన్న సిబ్బంది కోరిన దాని కంటే ఎక్కువగా ఏకంగా 44 శాతం ఫిట్ మెంట్ ప్రకటించాం. అయినా పని తీరు మారలేదు. మళ్లీ ఇప్పుడు కార్మికుల డిమాండ్ల పేరుతో సమ్మె నోటీసు ఇవ్వటం ఏమిటి?’’ అంటూ వేసిన ప్రశ్నలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు నీళ్లు నమలటం మినహా మరింకేమీ చేయలేని పరిస్థితి.
ఆర్టీసీ అధికారులతో సమీక్షను నిర్వహించిన సందర్భంగా కేసీఆర్ తీసిన లాజిక్ కు అధికారులు కంగుతినే పరిస్థితి. ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ ప్రైవేటు బస్సు సర్వీసులు లాభాలు గడిస్తుంటే.. ఆర్టీసీకి మాత్రం లాభాలు ఎందుకు రావటం లేదని ఆయన వేసిన ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. తన ప్రశ్నకు తానే సమాధానం చెప్పుకున్న కేసీఆర్.. ప్రజల అవసరాలకు తగ్గటలుగా ఆర్టీసీ బస్సులు నడపటం లేదన్న వాస్తవాన్ని గ్రహించాలన్నారు.
ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు కేసీఆర్ కొన్ని సలహాలు ఇవ్వటం గమనార్హం. నిజానికి ఇలాంటి ఆలోచనలు ఆర్టీసీ ఉన్నతాధికారులు చేయాల్సి ఉన్నా.. అందుకు భిన్నంగా వారికే కేసీఆర్ చెప్పాల్సిన దుస్థితి చూస్తేనే.. ఆర్టీసీ ఎందుకు నష్టాల్లో ఉందో ఇట్టే అర్థమయ్యే పరిస్థితి. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుగా ఉన్న అవకాశాల్ని కేసీఆర్ చెప్పిన తీరు చూస్తే.. ఆయనలో మార్కెటింగ్ మనిషి కనిపించక మానరు
ఆర్టీసీ ఆదాయం పెంచుకోవటానికి కేసీఆర్ ఐడియాలు చూస్తే..
= 10.. 15 మంది పట్టే చిన్న బస్సుల్ని పెట్టండి. అవసరమైతే వాటిని ప్రయాణికుల ఇళ్ల వరకూ నడపండి.
= టికెట్ల ద్వారానే కాదు.. వాణిజ్య ప్రకటనలు.. కొరియర్ ద్వారా కూడా ఆదాయాన్ని పెంచే ఏర్పాట్లు చేయండి.
= తిరుపతి.. షిర్డీ లాంటి ప్రధాన పుణ్యక్షేత్రాలతో పాటు జాతరులు.. పుష్కరాలకు ప్రత్యేకంగా బస్సులు నడపండి.
= ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులకు దైవ దర్శనం.. వసతి తదితరాల్లో ప్రాధాన్యం కలిగించేలా చర్యలు తీసుకోండి.
= పర్యాటక శాఖతో ఆర్టీసీఅనుసంధానం కావాలి.