భువనేశ్వరి వదిన ఓటు మాకే: కేసీఆర్

Update: 2016-01-30 16:00 GMT
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఓ వైపు చంద్రబాబు.. మరోవైపు కేసీఆర్ ప్రచార సభలతో హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్... టీడీపీ చీఫ్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించాడు. ‘మా బజార్లు మేమే ఊడ్చుకుంటాం.. మీరు ఊడ్చుకోవడానికి హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు వుంది. మీ బజార్లు మీరే ఊడ్చుకోండి. మీకు ఆంధ్ర ప్రజలు ఓటేసి గెలిపించారు. మీరు పాలన చేసుకోండి. మా పాలన మేం చేసుకుంటాం. మీకు ఏం పని? ఒదల బొమ్మాళీ వదలా అని అంటున్నావ్. నిన్ను ఎవడు పొమ్మన్నాడ్. నీకు కావాల్సివుంటే మరో ఇరవై హెరిటేజ్ దుకాణాలకు పర్మిషన్ ఇస్తా. నిన్ను ఎవరు వదలమన్నారు. పదిహేను రోజులకోసారి వచ్చిపో. ఇక్కడ మా వదిన భువనేశ్వరి నీ వ్యాపారం చూస్తోంది. నీకంటే ఆమె చాలా నిజాయతీ పరురాలు. మొన్న మా కార్యకర్తలు వెళ్లి ఓటు అడిగితే.. హైదరాబాద్ లో మీకే నా ఓటు అన్నది. ఆమె పాలన దగ్గరుండి చూస్తోంది. భువనేశ్వరి వదిన ఓటు మాకే’ అంటూ కేసీఆర్ సెంటిమెంట్ ను రగిల్చాడు. ఓ వైపు బాబును తిడుతూనే.. మరో వైపు సెంటి మెంటుతో ఆంద్రా ఓటర్లను ఆకట్టుకోవడానికి ట్రై చేశాడు.
Tags:    

Similar News