దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయ్యాయి. దీనిని పురస్కరించుకుని ఆగస్టు 15 సందర్భం గా దేశవ్యాప్తంగా.. పండుగ వాతావరణం నెలకొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఢిల్లీలోని ఎర్రకోటపై.. జెండా ఆవిష్కరించారు. ఇక, రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు.. జెండా వందన చేసి.. రాష్ట్ర ప్రగతిని ఆవిష్కరిం చాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన పంద్రాగస్టు.. వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో పోలీసు బ్యాండ్.. కవాతు హైలెట్‌గా నిలిచాయి.
75 వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్.. గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాన ప్రసంగం చేస్తూ.. సర్వసాధారణంగా ఆయన తెలంగాణపై ఎప్పటిలాగా నే పొగడ్తలు కురిపించారు. రాష్ట్రం ఏర్పడే నాటి పరిస్థితులకు, నేటికి అసలు పోలికే లేదని... అన్ని రంగాల్లో గుణాత్మక, గణనీయ అభివృద్ధిని ఆవిష్కరిం చామని కేసీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాట ఉజ్వల ఘట్టాలను దేశం స్మరించుకుంటోం దన్నారు.
స్వాతంత్య్ర ఫలాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందన్నారు. అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రచించుకున్నట్టుచెప్పుకొచ్చారు. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించామన్నారు. విద్యుత్, తాగు, సాగునీటి రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచినట్టు తెలిపా రు. ఏడేళ్లలోనే స్థిర ఆర్థికాభివృద్ధితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించిందని చెప్పారు. 2013 -2014లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.4,51,580 కోట్లు ఉందన్నారు.
దీనిని 2020-2021లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9,80,407 కోట్లకు చేరిందని చెప్పారు. కరోనా తీవ్ర అవరోధా లు సృష్టించినా అభివృద్ధి ఆగలేదని, 2013-2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,12,126 కాగా.. నేడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,37,632గా ఉందని చెప్పారు. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపుగా ఉందని.. తలసరి ఆదాయంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కేసీఆర్ వివరించారు. కాగా, ఇటీవల కాలంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్న దళితుల అంశాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించారు.
దేశానికి స్వతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా దళితుల పరిస్థితి బాగోలేదని.. వారు ఇప్పటికీ దుర్భర జీవితాలనే గడుపుతున్నారని.. కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చిందని.. దీనిని రేపటి నుంచి(ఆగస్టు 16) అమలు చేయనున్నట్టు ఆయన చెప్పారు. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేసి.. మిగిలిన నియోజకవర్గాల్లోనూ తాత్కాలికంగా.. అమలు చేస్తామని.. వివరించారు. దళితులు దేవుళ్లతో సమానమని.. వారిని కష్టపెట్టడం.. వారిని పట్టించుకోకపోవడం మహాపాపమని.. కేసీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం.