కరోనా దెబ్బకు ఈ రంగం...ఆ రంగం అని తేడా లేకుండా...అన్ని రంగాలు మూతబడ్డాయి. ప్రపంచదేశాలలోని రైతాంగంపై కరోనా పంజా విసిరింది. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్ లో కరోనా ధాటికి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ తో పాటు, తెలంగాణలోనూ రైతాంగం కరోనా దెబ్బకు కుదేలైంది. మన దేశంలో పండే చాలా పంటలు విదేశాలకు , ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. కరోనా కోరలు చాచడంతో గత రెండు మూడు నెలలుగా విదేశీ ఎగుమతులు ఆగిపోయిన పరిస్థితి. రైతులందరికీ పంట చేతికొచ్చే సమయంలో కరోనా కాటు వేసింది. దీంతో, పంటను మార్కెట్ లోకో -మార్కెట్ యార్డుకో తీసుకువచ్చి సొమ్ము చేసుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుచూపుతో వ్యవహరించారు. తెలంగాణలో పండిన ప్రతి పంటను, ప్రతి కాయను తెలంగాణలోనే వాడుకోవాలని డిసైడ్ చేశారు.
కరోనా విపత్తు నేపథ్యంలో నిత్యావసరాలు, వ్యవసాయాధారిత ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతోపాటు, తెలంగాణ లో పండించిన పంటను ఇపుడు ఎగుమతి చేసుకునే పరిస్థితి లేదు. కరోనా తీవ్రత తగ్గి...పరిస్థితులన్నీ చక్కబడేందుకు మరో రెండు నెలలు పట్టవచ్చు. కరోనా దెబ్బకు దాదాపుగా అన్ని రాష్ట్రాలు కుదేలయ్యాయి కాబట్టి....ఇతర రాష్ట్రాలకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎగుమతి చేయవద్దని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో బియ్యం, మొక్క జొన్న, గోధుమల కొరత ఉంటుంది. అలా అని తెలంగాణ నుంచి ఎగుమతి చేస్తే...స్వరాష్ట్రంలో కొరత వస్తుంది. అందుకే, తెలంగాణలో పండిన ప్రతి పంటను ప్రభుత్వమే కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. విపత్తు వచ్చిందని అధైర్య పడకుండా...భవిష్యత్తును అంచనా వేసి ఎగుమతులను ఆపాలన్న కేసీఆర్ నిర్ణయంపై ప్రశంసలజల్లు కురుస్తోంది. కరోనా వల్ల సొంత రాష్ట్రాలకు వెళ్లలేకపోయినా వారిని అక్కున చేర్చుకొని అన్నంపెడతానన్న కేసీఆర్....తమ రాష్ట్రం వారి భవిష్యత్తు కోసం ఎగుమతులు నిలిపివేసిన వైనం ప్రశంసనీయం.