తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సర్వేలంటే ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశం అంటే చాలు.. సర్వే రిపోర్ట్ అంటూ ఎక్కడ తమకు అక్షింతలు వేస్తారో అని కొందరు నేతలు బయపడుతుంటారనే టాక్ ఉంది. మరికొందరేమో అంతా బాగుందనే తీపికబురును బాస్ తమ చెవిన వేస్తారని భావిస్తుంటారు. గతంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ భవన్‌లో తన అధ్యక్షతన జరిగిన టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశంలో పార్టీ మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకు ఇదే తరహాలో తీపికబురు అందించారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 101 నుంచి 106 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్న విషయాన్ని నేతలతో ప్రస్తావించారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించానని పేర్కొంటూ ఆల్ ఈజ్ వెల్ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
అయితే తాజాగా వెలువడిన ఓ సర్వే ప్రకారం టీఆర్ ఎస్ 2019 ప్రయాణం నల్లేరు మీద నడకే కాదట. అధికారం దక్కించుకునేందుకు చాలా గట్టిపోటీని గులాబీ దళపతి ఎదుర్కోవాల్సి ఉంటుందని ముచ్చటగా మూడో సారి జరిగిన సర్వే తేల్చిదంటున్నారు. అయితే ఈ సర్వేలో కొన్ని చిత్రాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. సంక్షేమం - అభివృద్ధి ఎజెండాగా సర్కారు ముందుకు పోతున్న క్రమంలో కేసీఆర్ ఇమేజ్ పెరిగిపోతోందని సర్వే తేల్చింది. అయితే ఎమ్మెల్యేలు - ఎంపీల విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయిందని ఈ సర్వే తేల్చిందట. దాదాపుగా 60 శాతం మంది ఎమ్మెల్యేలు గడ్డుకాలం ఎదుర్కుంటున్నారట. ఇక పార్టీ ఎంపీల విషయానికి వస్తే మొత్తం 12 మందిలో 3కి మాత్రమే సానుకూల వాతావరణం ఉందని సర్వే తేల్చిందట.
ఈ ముగ్గురు ఎంపీలు మినహా మిగతా వారంతా గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందేనని తాజా సర్వే తేల్చిచెప్పినట్లు సమాచారం. పార్టీ మొత్తంగా బాగున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎంపీలు - ఎమ్మెల్యేల కారణంగా దెబ్బతినే పరిస్థితి ఉండటం గులాబీ బాస్ ను కలవర పరిచిందని అంటున్నారు. అందుకే ప్రత్యేకంగా ఓ సమావేశం ఏర్పాటు చేయాలని కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రజాదరణ పొందలేని పార్టీ ప్రజాప్రతినిధులకు క్లాస్ తీసుకుంటారని అంటున్నారు.