మంత్రి పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం చేయడం అందరూ చేసేదే.. పక్క రాష్ట్రం సీఎం జగన్ అయితే ఏకంగా 10 ఏళ్లు వైసీపీ కోసం పోరాడిన వైసీపీ సీనియర్ ఎమ్మెల్యేలు రోజా, అంబటి రాంబాబు, ధర్మాన, కరుణాకర్ రెడ్డి లాంటి వారిని సామాజిక న్యాయం పేరిట పక్కనపెట్టి అణగారిన వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చారు. సామాజిక న్యాయంలో నేనే తోపు అని నిరూపించుకున్నాడు. అగ్రవర్ణాలను పక్కనపెట్టేశాడు. అయితే తెలంగాణలో మాత్రం డిఫెరెంట్.. ‘ఎస్సీ’ వర్గానికి డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చి కేసీఆర్ తీసేశారు.. ప్రస్తుతం ‘మాల’లే మంత్రులుగా ఉండగా.. ఎస్సీలు లేరనే విమర్శ తెలంగాణ ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎప్పుడూ చేయని విధంగా సామాజిక న్యాయం చేయడానికి రెడీ కావడం హాట్ టాపిక్ గా మారింది. చివరికి మద్యం దుకాణాల్లోనూ అందరికీ సమానంగా న్యాయం చేసేందుకు రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఈ రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్ గడువును నెలరోజులు పెంచడం విశేషం.
మద్యం దుకాణాల టెండర్లకు ఎలాంటి రిజర్వేషన్లు లేవు. కోట్ల రూపాయలు ఉన్న బడాబాబులు, బడా వ్యాపారులు వీటిని వేలంలో దక్కించుకొని నిర్వహిస్తుంటారు. పైసలు లేని అసలు ఈ మద్యం టెండర్లలోకి ఎవ్వరికీ అనుమతి లేదు. మరి కేసీఆర్ చేస్తున్న రిజర్వేషన్ల సామాజిక న్యాయంలో పేదలకు అవకాశం దక్కుతుందా? అన్నదే ఇక్కడ ప్రశ్న. కోట్లు టెండర్ పెట్టాల్సిన ఈ రంగంలో పేదలు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించినా ఏం ప్రయోజనం అన్న ప్రశ్న అందరినుంచి వినిపిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లలో ఎక్కువగా గౌడ సామాజిక వర్గానికి 15శాతం రిజర్వేషన్ కల్పించింది. వారు ఎక్కువగా కల్లు, మద్యం వ్యాపారాల్లో ఉంటారు కాబట్టి అత్యధిక రిజర్వేషన్లు వారికే సొంతం చేసింది. ఇక 10శాతం ఎస్సీలకు, 5 శాతం ఎస్టీలకు కేటాయించింది. ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకొని జీవో రిలీజ్ చేశారు.
తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్ లు కేవలం 2 ఏళ్లకు మాత్రమే ఇస్తారు. ప్రస్తుతం నడుస్తున్నవి ఈ నెలతో ముగుస్తాయి. తర్వాత గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయిస్తారు. వారికి అంత సామర్థ్యం డబ్బు పరపతి లేకున్నా.. వారిపేరు మీద బడాబాబులు ఈ రిజర్వేషన్లు వాడుకునే అవకాశం ఉంది. ఇక 15శాతం రిజర్వేషన్లు గౌడ్ సామాజికవర్గానికి కేటాయించడంతో వారికే ఎక్కువగా దక్కే అవకాశాలున్నాయి. ఎస్సీ, ఎస్టీల పేరిట దుకాణాలను దక్కించుకొని నిర్వహించుకునేందుకు ఇతర బలవంతులకు ఈ రిజర్వేషన్ల ద్వారా అవకాశం దక్కిందనే టాక్ నడుస్తోంది.