టీఆర్ఎస్ పార్టీ పెట్టిన క్షణం నుంచి ఏ వేదిక మీద మాట్లాడినా కేసీఆర్ నోటి నుంచి జైతెలంగాణ అన్న నినాదం తరచూ వినిపిస్తూ ఉంటుంది. తన ప్రసంగం చివర్లో తప్పనిసరిగా జై తెలంగాణ నినాదం ఇచ్చి తన ప్రసంగాన్ని ముగించటం కేసీఆర్ కు అలవాటు. ఆ మాటకు వస్తే.. కేసీఆర్ తో పాటు..టీఆర్ఎస్ నేతలంతా అదే తీరులో నినాదాన్ని ఇచ్చి ప్రసంగాన్ని ముగిస్తుంటారు.
తాజాగా జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టిన కేసీఆర్.. తన నినాదాన్ని మార్చుకున్నారు. దేశంలో కాంగ్రెస్.. బీజేపీ ప్రభుత్వాలే పాలిస్తాయా? మరెవరిని పాలించనీయరా? అన్న ప్రశ్నతో పాటు.. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో అత్యధిక కాలం కాంగ్రెస్ పవర్లో ఉంటే.. బీజేపీ దాదాపు పదేళ్లు.. మరికొన్ని పార్టీలు మొత్తంగా పదేళ్లు పాలించాయన్నారు.
అయితే.. బీజేపీ.. కాదంటే కాంగ్రెస్ అన్నది ఈ రెండు పార్టీలకు అలవాటుగా మారిపోయిందని.. డీఫాల్ట్ రాజకీయాలు చేయటం మొదలెట్టారని మండిపడ్డారు.
బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తాము కూటమి కడతామని.. దేశంలో గుణాత్మక మార్పు తెచ్చేందుకు తాను ప్రయత్నిస్తానని.. రానున్న రెండు నెలల్లో పలు రాష్ట్రాల్లో తాను పక్షిలా పర్యటిస్తానని చెప్పుకున్నారు కేసీఆర్. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని ప్రాంతీయ పార్టీల్ని ఒక కూటమి కిందకు తీసుకొచ్చి.. దేశానికి మేలు జరిగేలా చేస్తానని చెప్పారు. తెలంగాణ బిడ్డగా తెలంగాణకు మాత్రమే కాదు.. ఈ దేశంలో పుట్టిన దానికి ఈ దేశ అభివృద్ధి మార్పులోనూ తాను పాలుపంచుకుంటానని.. తాను చేయాల్సిందంతా చేస్తానన్నారు
.
తాను ఏ విధంగా అయితే మొండిగా తెలంగాణ నినాదాన్ని చేపట్టానో.. అదే రీతిలో ఫెడరల్ ఫ్రంట్ నినాదాన్ని తెర మీదకు తెస్తానన్నారు. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటే.. నీటి యుద్ధాల మాట దేశ పాలకుల నోటి నుంచి ఎందుకు వస్తుందని ప్రశ్నించిన ఆయన.. తాను చెప్పిన మాట నిజమా? కాదా? అన్నది చెప్పాలని బీజేపీ.. కాంగ్రెస్ నేతలతో పాటు.. ప్రధాని మోడీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లు సమాధానం చెప్పాలన్నారు.
తన సుదీర్ఘ ప్రసంగం చివర్లో ఎప్పటి మాదిరే జై తెలంగాణ అంటూ నినాదం చేసిన కేసీఆర్.. మారిన పరిస్థితులకు అనుగుణంగా.. ఫెడరల్ ప్రంట్ మాటలకు తగ్గట్లు.. జై భారత్ అన్న నినాదాన్ని ఆయన వినిపించారు. జై తెలంగాణ.. జై భారత్ అంటూ కేసీఆర్ నినాదాలు కాస్తంత కొత్తగా మారాయి. రానున్న రోజుల్లో ఈ రెండు నినాదాలు సుపరిచితం కావటం ఖాయం.