కేసీఆర్ ను ఆయ‌న‌తో పోల్చార‌ట జైట్లీ

Update: 2017-03-29 09:37 GMT
పొగిడించుకోవ‌టం ఒక క‌ళ‌. ప‌వ‌ర్ చేతిలో ఉన్నా.. ప‌వ‌ర్ ఫుల్ ఫ్లేస్‌ లో ఉన్నా.. పొగ‌డ్త‌లు కోరుకోకున్నావ‌చ్చి ప‌డుతుంటాయి. కానీ.. ఎబ్బెట్టు లేకుండా త‌న‌ను తాను పొగుడుకోవ‌టం చాలా త‌క్కువ మందిలో మాత్ర‌మే ఉంటుంది. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌ను తాను నిత్యం పొగుడుకుంటారు. హైద‌రాబాద్ ను తానే క‌ట్టించిన‌ట్లుగా ఆయ‌న మాట‌లు ఉంటాయంటూ షోస‌ల్ మీడియాలో ఎట‌కారాలు క‌నిపిస్తుంటాయి. ఎందుకిలా అంటే.. ఆయ‌న చెప్పే మాట‌లు.. వ్యంగ్య వ్యాఖ్య‌లు చేసేందుకు అవ‌కాశం ఉండేలా ఉంటాయి.

కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాస్త భిన్నం. ఆయ‌న మాట‌లు ఎంత చెబుతున్నా.. అలా వినాల‌నిపించేలా ఉంటాయి. క‌థ చెప్పిన‌ట్లుగా ఉంటాయి. ఆయ‌న మాట్లాడేట‌ప్పుడు ఎవ‌రిని ఎన్ని మాట‌లు అన్నా.. ప్ర‌భుత్వం గురించి.. త‌న పాల‌న గురించి ఎంత గొప్ప‌లు చెప్పుకున్నా.. చివ‌ర‌కు త‌న గురించి తాను చెప్పుకుంటూ.. తానెంతో మొనగాడిన‌న్న విష‌యాన్ని చెప్పినా.. చెవులు రిక్కించి వింటారే కానీ.. ఎవ‌రూ ప‌ల్లెత్తు మాట అనే ధైర్యం చేయ‌రు. ఎందుకిలా అంటే.. ఆయ‌న మాట‌లు అంత చాక‌చ‌క్యంగా ఉంటాయి మ‌రి.

ఉగాది సంద‌ర్భంగా నిర్వ‌హించిన పంచాంగ శ్ర‌వ‌ణం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. హోం మంత్రి నాయినికి బాగోలేద‌ని పంచాంగంలో చెప్పార‌ని.. ఆ స‌మ‌యంలో కింద కూర్చున్న పోలీస్ క‌మిష‌న‌ర్ మ‌హేంద‌ర్ రెడ్డి న‌వ్వుతున్నార‌న్నారు. అనంత‌రం తెలంగాణ రాష్ట్రం ఎంత‌లా దూసుకెళుతుందో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. దాదాపు 22 శాతానికి పైగా అభివృద్ధిలో దూసుకెళుతుంద‌ని.. ప‌దిహేను శాతానికి ఎట్టి ప‌రిస్థితుల్లో త‌గ్గేది లేద‌న్న విష‌యాన్ని అధికారులు చెబుతున్నార‌న్నారు.

కొత్త రాష్ట్రం ఇంత‌లా దూసుకెళ్ల‌టంపై ఢిల్లీలో ప‌లువురు అభినందిస్తుంటార‌ని.. ప్ర‌ధానిని క‌లిసిన‌ప్పుడు కూడా ఆయ‌న బాగా ప‌ని చేస్తున్నార‌ని.. అవినీతి లేకుండా పాల‌న చేస్తున్న‌ట్లుగా చెబుతార‌న్నారు.

ఈ సంద‌ర్భంగా అరుణ్ జైట్లీ త‌న గురించి చేసిన వ్యాఖ్య‌ల్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ఉద్య‌మ‌నాయకుడిగా ఉన్న త‌న‌ను పాల‌న విష‌యంలో ఇంత బాగా పాలిస్తార‌ని తాము అనుకోలేద‌ని.. చ‌ర్చిల్ యుద్ధ నాయ‌కుడిగా పేరున్న‌ప్ప‌టికి పాల‌న‌లో ఫెయిల్ అయ్యార‌ని.. ఉద్య‌మ నాయ‌కుడి ఉన్న త‌న‌ను మాత్రం బాగా ప‌రిపాలిస్తున్నారంటూ జైట్లీ మెచ్చుకుంటున్న‌ట్లుగా చెప్పుకున్నారు. ఇంత‌లా త‌న‌ను తాను పొగ‌డుకోవ‌టం.. అది కూడా ఎవ‌రూ వంక పెట్ట‌లేని విధంగా అంటే అది కేసీఆర్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుందేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News