ప్రగతిభవన్ లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్. శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశం సుదీర్ఘంగా సాగింది. రివ్యూ మీటింగ్ ప్రారంభం కావటానికి కాస్త ముందు ప్రగతి భవన్ కు కేసీఆర్ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అంతకు ముందు ఆయన ఎక్కడున్నారు? అన్న విషయంలోకి వెళితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. లాక్ డౌన్ వేళ.. ఎవరికి వారు.. వారిళ్లకే పరిమితం కావాలని.. ఎంతో అవసరమైతే తప్పించి వీధుల్లోకి రావొద్దన్న మాటను తరచూ చెబుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం లాక్ డౌన్ వేళలోనూ ప్రగతిభవన్ టు ఫామ్ హౌస్ మధ్య షటిల్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కీలకమైన రివ్యూ సమావేశాలు.. అధికారులతో భేటీల్ని పూర్తి చేసిన తర్వాత.. ముఖ్యమైన అంశాలకు తప్పించి కేసీఆర్ పెద్దగా రియాక్టు కావట్లేదు. అలా అని.. పని చేయట్లేదని చెప్పలేం కానీ.. ప్రగతి భవన్ లో మాత్రం ఉండటం లేదని చెప్పక తప్పదు.
లాక్ డౌన్ వేళలోనూ తనకెంతో ఇష్టమైన ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ గడుపుతున్నట్లు చెబుతున్నారు. విశాలమైన ప్రాంగణంలో ఉండే ఫామ్ హౌస్ లో తనకెంతో ఇష్టమైన వ్యవసాయంతో పాటు.. కీలక అంశాల మీద అధ్యయనం.. ముఖ్యులతో భేటీ..కీలక అంశాలపై తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించిన చర్చలు ఫామ్ హౌస్ లోనే సాగుతున్నట్లు చెబుతున్నారు. విరాళాలు ఇచ్చే ప్రముఖులకు అపాయింట్ మెంట్లను ప్రగతి భవన్ లో ఉన్నప్పుడే ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. లాక్ డౌన్ వేళలోనూ తరచూ ఫామ్ హౌస్ కు వెళుతున్న కేసీఆర్ తీరు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారుతోంది.