ఆయుత చండీయాగం పూజ‌లు మొద‌లు

Update: 2015-11-27 07:57 GMT
డిసెంబ‌రు నాలుగో వారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ్య‌క్తిగ‌త హోదాలో అయుత చండీయాగం నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించి సంద‌డి మొద‌లైంది. తెలంగాణ సంక్షేమం కోసం నిర్వ‌హిస్తున్న ఈ భారీ క్ర‌తువును దిగ్విజ‌యంగా పూర్తి చేసేలా ముందుస్తుగా కొన్ని పూజ‌లు నిర్వ‌హిస్తుంటారు.

తాజాగా అందుకు సంబంధించిన పూజ‌ల్ని చేప‌ట్టారు. శుక్ర‌వారం ఉద‌యం నిర్వ‌హించిన ఈ పూజ‌ల‌కు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఆయ‌న స‌తీమ‌ణి పాల్గొన్నారు. మెద‌క్ జిల్లాలోని ఎర్ర‌వ‌ల్లి వ్య‌వ‌సాయ క్షేత్రంలో నిర్వ‌హించిన హోమం.. హ‌వ‌న పూజ‌ల్ని నిర్వ‌హించారు. చండీయాగానికి ఆరంభంగా ఇలాంటి పూజ‌లు నిర్వ‌హిస్తార‌ని చెబుతున్నారు. భారీ క్ర‌తువుకు సంబంధించిన పూజ‌లు షురూ అయిన నేప‌థ్యంలో పూజ‌ల‌తో.. కేసీఆర్ మ‌రింత బిజీ అవుతార‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News