``నాపై అక్రమ కేసులు పెట్టి.. నన్ను ఒంటరిని చేయాలని.. రాజకీయంగా నన్ను.. బలి చేయాలని చూస్తున్రు. ఇదిగో చెబుతున్నా.. కేసీఆర్ ఖబడ్దార్! నీ ఎత్తులు చిత్తు చేస్తా.. హుజూరాబాద్‌లో నువ్వో నేనే తేలుస్తా! ఇక్కడి ప్రజలు నావెంట ఉన్నరో.. నీ వెంట ఉన్నరో చూద్దాం!!`` ఇదీ.. కొన్నాళ్ల కిందట మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీ నేత.. ఈటల రాజేందర్ మీడియా ముఖంగా చేసిన సవాల్. నిజమే అప్పటి వేడిలో అందరూ ఈటల వైపు ఉన్నారు. ఆయనను అన్యాయంగా మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారని భావించారు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఇంకా నోటిఫిషన్ కూడా రాకుండానే ఈటలే గెలుపంటూ.. పందేలు కూడా కట్టేశారు.
పరిస్థితి మారుతోంది!
కానీ, ఇప్పుడు పరిస్థితి యూటర్న్ తీసుకుంది. హుజూరాబాద్ ఉప పోరు ఆలస్యం అయ్యే కొద్దీ.. ఇక్కడ సమీకరణలు మారుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఇక్కడ వ్యవహరిస్తోంది. ఈటల బలం, బలగంపై ఆచితూచి దెబ్బకొడుతోంది. దీంతో ఇప్పుడు ఈటల పరిస్థితి ఆదిలో ఉన్నట్టుగా మాత్రం కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. వరుస విజయాలతో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటలకు హుజూరాబాద్లో గట్టి పట్టుంది. తన కను సైగలతోనే ఇక్కడ రాజకీయాలను శాసించారు. దీంతో క్షేత్రస్థాయిలో ఈటలకు మంచి మద్దతు లభించింది. అయితే.. ఇప్పుడు ఈ పరిస్థితి మారిపోతోంది.
ఒక్కొక్కరుగా దూరం!
నిన్న మొన్నటి వరకు ఈటల వైపు ఉన్న టీఆర్‌ఎస్‌కు చెందిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీలు, సర్పంచులు, సహకార సంఘాల నేతలు, పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న నేతలు ఈ రెండు నెలల్లో ఈటలను వీడి మళ్లీ టీఆర్‌ఎస్ వైపు మళ్లారు. ప్రజాబలం, ప్రజల సానుభూతి తనకే ఉందని ఈటల విశ్వసిస్తుండగా ఆ బలం, సానుభూతి ఓటుగా మారి పోలింగ్ బూత్‌కు వచ్చేలా చేసే శక్తి ఆయన వెంట లేకుండా చేసేందుకు టీఆర్‌ఎస్ స్కెచ్ వేసింది. ఈటల సామాజిక వర్గానికి చెందిన నేతలూ ఆయనను వీడుతున్నారు. దీంతో ఈటల పరిస్థితి ఇబ్బందిగా మారిందని అంటున్నారు పరిశీలకులు.
బీజేపీ నేతలు కూడా!
ప్రస్తుతం ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నారు. ఈయనకు స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు మద్దతు ఇవ్వడం సహజం అయితే.. ఇప్పుడు వీరిని కూడా టీఆర్ ఎస్ వ్యూహాత్మకంగా ఈటలకు దూరం చేస్తోంది. దీంతో బీజేపీ నుంచి కొందరు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. చివరికి ఈటల రాజేందర్ సొంత సామాజిక వర్గానికి చెందిన ముదిరాజ్ నేతలు కూడా ఆయనను వీడుతున్నారు. ఈటల మంత్రిగా ఉన్న కాలంలో ఆయన వెంట ఉంటూ వివిధ పదవులను నిర్వహించిన నేతలు ఆయనను వీడి టీఆర్‌ఎస్ గూటికి చేరారు.
దూరమైంది వీరే..
+ ఈటలకు దూరమైన దగ్గరి వర్గంలో కీలక నేతలు చాలా మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మత్స్య పారిశ్రామిక సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన పోలు లక్ష్మణ్ సుమారు 1500 మందితో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు.
+ జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ప్రస్తుత జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వైస్ చైర్మన్, గతంలో రెండుసార్లు విలాసాగర్ సర్పంచ్‌గా పనిచేసిన పింగిలి రమేశ్ అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు.
+ వీణవంక ఎంపీటీసీ, మండలపరిషత్ ఉపాధ్యక్షురాలు రావిశెట్టి లతాశ్రీనివాస్ ఈటలను వీడి వారం క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరంతా ఈటల సొంత సామాజికవర్గమైన ముదిరాజ్ కులానికి చెందినవారు.
ఇది హరీశ్ వ్యూహమేనా?
హుజూరాబాద్‌లో టీఆర్ ఎస్‌ను గెలిపించి.. ఈటలను ఓడించే బాధ్యతను భుజాలమీద వేసుకున్న మంత్రి హరీశ్ రావే ఈ కథ నడిపిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. సొంత సామాజికవర్గానికి చెందిన నేతలను ఈటల వెంట లేకుండా చూసి ఆయనను నైతికంగా బలహీనుడిగా మార్చేందుకు హరీశ్‌రావు వ్యూహంలో భాగంగానే ఈ వ్యవహారమంతా నడుస్తున్నదని అనుకుంటున్నారు. నియోజక వర్గంలో ముదిరాజ్‌ల ఓట్లు 23,200 ఉండగా ఆ ఓటు బ్యాంకులో చీలిక తీసుకురావడానికి హరీ శ్ ప్రయత్నం సఫలమవుతుందా? లేదా.. అనేది పక్కన పెడితే.. నైతికంగా ఇప్పటికిప్పుడు.. ఈటలకు మాత్రం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది.
దళిత బంధు.. ఈటలకు ఇబ్బందే!
హుజూరాబాద్ నియోజకవర్గంలో 2,26,553 ఓట్లు ఉండగా వీటిలో 46,700 ఓట్లు దళిత సామాజికవర్గానికి చెందినవి కావడం గమనార్హం. ఈ ఓటర్లందరికి చెందిన సుమారు 23 వేల కుటుంబాలకు దళితబంధు పథకం కింద పదేసి లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందుతున్నది. వీరిలో ఇప్పటికే సగం మంది ఖాతాల్లో ఆ డబ్బు జమ అయింది. ఈ పరిణామం.. ఖచ్చితంగా ఈటలకు ఇబ్బందిగా మారేదనని అంటున్నారు.
సామాజిక వర్గాల వారీగా..
రెడ్డి, కాపు, వైశ్య, యాదవ, పద్మశాలి, గొల్ల, గౌడ కులాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సామాజిక వర్గాలకు చెందిన సంఘాల నాయకులతో చర్చించి వారికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వైశ్య, కాపు, రెడ్డి, యాదవ, ముదిరాజ్, పద్మశాలి కుల సంఘాలకు భవన నిర్మాణాల కోసం స్థలం కేటాయించడంతోపాటు ఒక్కో సంఘ భవనానికి 50 లక్షల నుంచి కోటి రూపాయల మేరకు నిధులు మంజూరు చేసి ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా మొత్తంగా .. అన్ని వైపుల నుంచి ఈటలకు పెద్ద ఎత్తున సెగ తగులుతున్న మాట వాస్తవం. అయితే.. దీనిని ఎదుర్కొని కేవలం సెంటిమెంటు అస్త్రంతో ఈటల ఏమేరకు నెగ్గుకురాగలరో.. చూడాలి.