కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వేసిన ఎత్తుగడ ప్రశంసలు అందుకుంటోంది. ఏమాత్రం విమర్శలు - వ్యతిరేకత రాకుండా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ఆయన వేసిన పాచిక ఫలిస్తోందని, అతి త్వరలోనే దాదాపు 27 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కానున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని కేసీఆర్ ప్రకటించారు. అయితే, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని ఆయన ప్రకటించినప్పుడల్లా విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తే తమకు తీవ్ర స్థాయిలో అన్యాయం జరుగుతుందని, ఏమాత్రం కష్టపడకుండా, పరీక్షలు రాయకుండా ఉద్యోగంలో చేరిన వారు ప్రభుత్వ ఉద్యోగులు అవుతారని, తమకు అన్యాయం జరుగుతుందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉస్మానియాలో కూడా ఈ ఆందోళన కొనసాగింది. కాంట్రాక్టు - ఔట్ సోర్సింగ్ కలిపి తమకు దాదాపు 50 వేల ఉద్యోగాల నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని చేపట్టకుండా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాధ్యం కాదని కేసీఆర్ కూడా గుర్తించారు.
అప్పటి నుంచి ఒక్కొక్కటిగా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ వస్తోంది. అతి త్వరలోనే డీఎస్సీని ప్రకటిస్తామని సంకేతాలు ఇచ్చింది. పది వేలకుపైగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. గ్రూప్ 2కు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. దాంతో కేసీఆర్ పై విద్యార్థుల్లో ఇప్పటి వరకూ ఉన్న ఆగ్రహం చాలా వరకూ తగ్గింది. ఇప్పుడు విద్యార్థులు - నిరుద్యోగులు భవిష్యత్తు మీద దృష్టి పెట్టారు. దాంతో క్రమబద్ధీకరణకు కూడా ఇదే సమయమని కేసీఆర్ భావించారు. మరికొద్ది రోజుల్లోనే క్రమబద్ధీకరణకు కూడా ఉత్తర్వులు వెలువడనున్నాయి.