బాబుకు కేసీఆర్ సలహాలు

Update: 2015-10-19 05:56 GMT
ఇద్దరు చంద్రుళ్ల మహా భేటీ ముగిసింది. ఇరువురు అగ్రనేతల భేటీ సందర్భంగా వచ్చిన కొన్న విషయాలు బయటకు వచ్చాయి. వారి మాటల్లో కొన్ని అంశాల మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రాజధాని నిర్మాణంలో భాగంగా అసెంబ్లీ.. సెక్రటేరియట్ భనాల్ని 500 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లుగా తాను విన్నానని.. కానీ వాటిని వెయ్యి ఎకరాల్లో నిర్మిస్తే బాగుంటుందన్న భావనను కేసీఆర్ వ్యక్తం చేయటం.. దీనికి చంద్రబాబు స్పందిస్తూ.. వివిధ డిజైన్లు పరిశీలిస్తున్నామని.. అవసరమైతే పెంచుకునే వీలుందని చెప్పటం గమనార్హం.

వాస్తు.. భవన నిర్మాణం లాంటి అంశాల విషయంలో చంద్రబాబుతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే పట్టు ఎక్కువన్న విషయాన్ని మర్చిపోకూడదు. విషయం ఏదైనా సరే.. సాధికారతతో మాట్లాడటం.. కొత్త అంశాల విషయాల్ని అధ్యయనం చేయటం లాంటివి కేసీఆర్ కు అలవాటే. తనకు సంబంధం లేకున్నా.. అమరావతిలో ఏం చేయనున్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటారన్నది మర్చిపోకూడదు.

గతంలో వీరిద్దరూ భేటీ అయిన సందర్భంగా అమరావతి పేరు.. ఎంపిక చేసిన స్థలం మీదన కేసీఆర్ కాంప్లిమెంట్ ఇవ్వటం తెలిసిందే. తాజాగా వారిద్దరి భేటీలో.. పేరు.. స్థల ఎంపిక బాగా కుదిరిందన్న బాబు మాటకు.. తాను ఆ విషయాన్ని గతంలోనే చెప్పానని.. అమరావతి వాస్తు అద్భుతంగా ఉందన్న మాటను కేసీఆర్ మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు.

జల రవాణాతో పాటు.. అమరావతి.. హైదరాబాద్.. బెంగళూరు రహదారి ప్రతిపాదన విషయంలో కేసీఆర్ సానుకూలంగా స్పందించటమే కాదు.. దీనిపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలన్న మాటను చెప్పటం గమనార్హం. శంకుస్థాపన పిలుపుల సమయంలో కేసీఆర్ ఇచ్చిన సలహాల్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కచ్ఛితంగా అమలు చేస్తే మంచిదన్నఅభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఎంత వైరం ఉన్నా.. సబ్జెక్ట్ విషయంలో కేసీఆర్ ఇచ్చే సలహాలు అత్యుత్తమైనవి చెబుతున్నారు. నిజానికి కేసీఆర్ మేథోతనం.. విషయ అవగాహన ఒకప్పటి బాస్ అయిన చంద్రబాబుకు తెలియంది కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News