చెవిలో పువ్వులు పెట్టటం ఓకే. కానీ.. కాలీఫ్లవర్లు పెట్టటం కష్టం. మరి.. ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్.. నిజామాబాద్ ఎంపీగా బరిలో దిగిన కల్వకుంట్ల కవిత మర్చిపోయారో ఏమో? ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. తమకు కూడా తప్పనిసరిగా హోదా ఇవ్వాల్సిందేనని కేసీఆర్.. కవితలు మాట్లాడిన విషయాన్ని మర్చిపోలేం. మరి.. ఆ విషయాల్ని వదిలేసిన ఆమె.. తాజాగా అందుకు భిన్నమైన వ్యాఖ్యను చేయటం గమనార్హం.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని వైనంపై నిరసన వ్యక్తం చేస్తూ.. మోడీ సర్కారుపై టీడీపీ లోక్ సభలో అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వటం.. ఈ సందర్భంగా టీఆర్ ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు చేరి.. తమ సమస్యల పరిష్కారం విషయంలో కేంద్రం ఫెయిల్ అయ్యిందంటూ గళం విప్పారే కానీ.. టీడీపీ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఒక్క మాట మాట్లాడలేదు. ఇదే కవిత.. ఏపీ హోదా కోసం మోడీ సర్కారుపై పెట్టిన అవిశ్వాసానికి తన ఓటు వేయలేదన్నది మర్చిపోకూడదు.
అలాంటి కవిత.. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా పాత విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు కవిత. ఏపీ హోదా విషయమై మన్మోహన్ సింగ్ ను కేసీఆర్ కలిసిన ప్పుడు చోటు చేసుకునే ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. అప్పట్లో ఏపీకి హోదా విషయం అడిగితే కేసీఆర్ ఓకే చెప్పారన్నారు. తెలంగాణ.. ఆంధ్రా ప్రాంతాల ప్రజలు బాగుండాలని కోరుకునే వ్యక్తి కేసీఆర్ అంటూ పొగిడేశారు. నిజమే.. రెండు రాష్ట్రాల్లోని తెలుగువారు బాగుండాలని కోరితే.. ఆంధ్రా నేతల పేరుతో ఆంధ్రోళ్లపై అదే పనిగా కేసీఆర్ తిట్ల దండకానికి అర్థమేమిటి?
ఆంధ్రోళ్లపై అంత అభిమానాన్ని కవిత ఎందుకు ప్రదర్శించారన్న విషయాన్ని వెతికితే.. ఆసక్తికరమైన విషయం బయటకు వస్తుంది. ఆంధ్రోళ్ల మీదా.. ఏపీకి ప్రత్యేకహోదా విషయమైన తన మద్దతును ప్రకటించిన కవిత పాల్గొన్న వేదిక ఏమిటో తెలుసా? తాను ఎంపీగా బరిలోకి దిగిన నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే బోధన్ లో. అది కూడా కమ్మ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సందర్భంలో కవిత నోటి నుంచి ఈ విలువైన వ్యాఖ్యలు వచ్చాయి.
కవిత మేడమ్ కు ఒక్క ప్రశ్న. హోదాను తమకు తగ్గట్లుగా వ్యాఖ్యలు చేసే ఆమె.. ఆంద్రోళ్లకు షార్ట్ మెమరీ లాస్ అన్న భావనలో ఉన్నారా? అన్నది ప్రశ్నగా మారింది. ఒక పక్క ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు ఇవ్వాల్సిందేనన్న మాటను పక్కన పెట్టేసి.. ఏపీకి ఇవ్వాల్సిన హోదా హామీ మీద కవిత ఇంత పాజిటివ్ గా ఫీల్ కావటానికి కారణం స్థల ప్రభావంతోపాటు.. ఆమె హాజరైన సంఘం ప్రభావం కూడా బలంగా పని చేసిందన్న మాట వినిపిస్తోంది. కవిత మేడమ్ చెప్పిన ఏపీ ప్రత్యేక హోదా మాటను భవిష్యత్తులో గుర్తు చేయటానికి తాజా సభకు హాజరైన వారు ఎవరో ఒకరు గుర్తు పెట్టుకుంటే మంచిదేమో?