తెలంగాణ రెండో సీఎంగా కేసీఆర్ ప్రమాణం

Update: 2018-12-13 08:05 GMT
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా.. వరుసగా రెండో సారి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం సరిగ్గా ముహూర్తాన్ని బట్టి 1.25 గంటలకు ప్రమాణం చేశారు. ‘కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు’ అనే నేను అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కేసీఆర్ చేయగానే సభకు వచ్చిన ఎమ్మెల్యేలు - మంత్రులు - ఎంపీలు హర్షధ్వానాలు చేశారు.

కేసీఆర్ తర్వాత మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ తో పాటు ప్రమాణం చేసిన వ్యక్తిగా మహమూద్ అలీ ప్రాముఖ్యతను పొందారు. తెలంగాణలో ఎక్కువ శాతం ఉన్న ముస్లింలకు కేసీఆర్ ప్రాముఖ్యతను ఇచ్చారు. ఆ కోవలోనే అదే వర్గానికి చెందిన మహమూద్ అలీకి రెండోసారి తన కేబినెట్ లోచోటు కల్పించడం విశేషంగా మారింది.

తెలంగాణ సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా ఎవ్వరికీ ప్రస్తుతానికి కేబినెట్ లో చోటు దక్కలేదు. వారం తర్వాత సామాజిక, జిల్లా కోణాలను అనుసరించి మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు తెలిసింది. శాసనసభ సమావేశాల అనంతరమే ఈ మంత్రివర్గ విస్తరణ చేపట్టునున్నట్టు తెలిసింది.  ప్రమాణ స్వీకారానికి ముందు తర్వాత జాతీయ గీతాలాపన చేశారు..

కాగా సభకు వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ భారీ విందునుఏర్పాటు చేశారు.
Tags:    

Similar News