అవును.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసు. ఎప్పుడు ఏ బాణాన్ని ప్రత్యర్థులపై సంధించాలో. తన అమ్ములపొదిలో కీలక ఆయుధాలైన భావోద్వేగాల్ని సమయానుకూలంగా బయటకు తీయటం.. దాన్ని సంధించే విషయంలోనూ ఆయన అనూహ్యంగా వ్యవహరిస్తుంటారు. ఇటీవల కాలంలో ప్రధాని మోడీతో తొడగొట్టి.. సై అంటే సై అన్న చందంగా సవాలు విసురుతున్న సీఎం కేసీఆర్ .. తాజాగా వికారాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజల్ని ఉద్దేశించిన మాట్లాడినకేసీఆర్.. ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు.
తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోడీ మోసం చేస్తున్నారని మండిపడిన సీఎం కేసీఆర్.. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళుతుందన్నారు. ఆయన ప్రసంగంలో హైలెట్ పాయింట్లు ఏమంటే..
- అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకుపోతోంది. రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తుంది. బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుతోంది.
- చావు అంచులదాకా వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చా. సిద్ధించిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అయితే రాష్ట్రం బాగుంటేనే సరిపోదు. దేశం కూడా బాగుండాలి.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని తప్పుడు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు కర్ణాటకకు మించి భూముల ధరల పెరిగాయి.
- కర్ణాటక కన్నా వికారాబాద్‌లో భూముల ధరలు ఎక్కువని, ఇక్కడ ఒక ఎకరం అమ్మితే అక్కడ మూడు ఎకరాలు కొనొచ్చు. తెలంగాణ ఏర్పడకపోతే వికారాబాద్ జిల్లాగా అయ్యేదా?
- మోడీ 8 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదు. సాక్ష్యాత్తు ప్రధాన మంత్రే తెలంగాణకు శత్రువు అయ్యారు. సంస్కరణల పేరుతో మనకు శఠగోపం పెట్టి షావుకార్లకు నింపుతున్నారు.
- ప్రధాని నిన్న గంట మాట్లాడారు. అంతా గ్యాసే. నెత్తికి రుమాల్ కట్టి వేషం తప్ప ఏముంది. డైలాగులు తప్ప దేశానికి మంచిమాట ఉందా?
- బీజేపీ జెండా పట్టుకొని నా బస్‌కు అడ్డం వసార్తా?. వికారాబాద్‌కు నేనేం తక్కువ చేశానో ప్రజలు చెప్పాలి. బీజేపీని నమ్ముకుంటే మనకు మళ్లీ పాత రోజులే వస్తాయి. కేంద్రం తీరు వల్లే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం అవుతోంది. రాష్ట్రాలకు మేలు చేయకపోగా పథకాలను రద్దు చేయాలంటున్నారు.
- బీజేపీ నేతలకు దమ్ముంటే ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని నిలదీయాలి. కేంద్రంలోనూ రాష్ట్రాల హక్కులను కాపాడే ప్రభుత్వం రావాలి.
- ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రధాని నెరవేర్చలేదని మండిపడ్డారు. దుర్మార్గమైన పాలకులను పారద్రోలి తెలంగాణను కాపాడానన్నారు. రాజకీయంగా చైతన్యం లేని సమాజం దోపిడీకి గురవుతుంది. మోసపోతే.. గోసపడతాం. గత ప్రభుత్వాల హయాంలో అవస్థలు పడ్డాం. మళ్లీ ఆ బాధలు తెలంగాణలో రావద్దంటే రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- తెలంగాణ సంక్షేమం కోసం.. దేశ ప్రధానినే ప్రశ్నించా. ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్రాన్ని నమ్మాల్సిన అవసరం ఉందా?
- ఎనిమిదేళ్ల పాలనలో ప్రధాని మోదీ చేసిందేమిటి?. మన సంక్షేమ పథకాలను ఉచితాల పేరుతో కేంద్రం అవమానిస్తోంది.