తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ రంగం సిద్ధం చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఆగస్టు మొదటివారంలోనే ఈ మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నట్టు పార్టీ వర్గాల నుంచి సమాచారం లీకైంది. మరి ఈ విస్తరణలో హరీష్ రావుకు మంత్రి పదవిపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. కేటీఆర్ కు విస్తరణలో చాన్స్ లభించడం ఖాయమన్నా అంచనాలు నెలకొంటున్నాయి.
ఇద్దరు మహిళలకు మంత్రులుగా అవకాశం ఖాయమని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేసీఆర్ కొత్త మంత్రివర్గంలో నలుగురికి స్థానం లభించబోతున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 6న ముహూర్తం ఖరారు చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సారి సీనియర్ నేతలకే బెర్త్ దక్కబోతోందని తెలుస్తోంది.
టీఆర్ ఎస్ వర్గాల నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు కొత్త మంత్రివర్గంలో కేటీఆర్ - హరీష్ లతోపాటు సబితా ఇంద్రారెడ్డి - తుమ్మల నాగేశ్వరరావులను కేబినెట్ లోకి కేసీఆర్ తీసుకుంటున్నట్టు సమాచారం. వీరి బెర్త్ లు దాదాపు ఖాయమన్న ప్రచారం సాగుతోంది.
హరీష్ రావు మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై దుమారం రేగింది. తెలంగాణ వ్యాప్తంగా హరీష్ పై సానుభూతి.. కేసీఆర్ తీరుపై విమర్శలు చెలరేగాయి. హరీష్ ను తీసుకొని ఈ అసంతృప్తికి ఫుల్ స్టాప్ పెట్టాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం.
కేసీఆర్ తో కలిపి మొత్తం 18మందిని కేబినెట్ లోకి తీసుకోవచ్చు. ఇప్పుడు 12మంది మంత్రులున్నారు. ఇంకా 6 బెర్తులు ఖాళీ. ఇప్పుడు నలుగురిని కొత్తగా తీసుకుంటున్నారు. వీరే కాక మరో మహిళా - మరో ఎస్టీ కేటగిరిలో మంత్రులను తీసుకుంటారన్న చర్చ సాగుతోంది. ఈ రెండు మున్సిపల్ ఎన్నికల తర్వాత భర్తీ చేయబోతున్నట్టు సమాచారం.