సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. బొటాబొటి సీట్లతో తమ అవసరం మోడీకి వస్తుందని.. అదే జరిగితే ఒకరకంగా.. ఒకవేళ అందుకు భిన్నంగా ఫెడరల్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం చిక్కితే జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న లెక్కలు వేసుకున్న కేసీఆర్ కు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి.
సార్వత్రిక ఫలితాలకు తగ్గట్లుగా పదవుల పంపిణీ విషయంలో కేసీఆర్ లెక్కలు ఘోరంగా దెబ్బతినటమే కాదు.. ఫలితాల తర్వాత ఫెడరల్ ఫ్రంట్ కాన్సెప్ట్ ను పక్కన పెట్టేయాలన్న విషయం తెలిసిందే. కేబినెట్ లో ఆరుగురు మంత్రులకు అవకాశం ఉన్న నేపథ్యంలో.. పెండింట్ లో ఉన్న ఆరు ఖాళీల్లో మంత్రుల్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జులై మొదటివారంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చెబుతున్నారు. తొలిదశలో మంత్రివర్గంలో చోటు లభించని కేటీఆర్.. హరీశ్ లకు ఈసారి పక్కాగా అవకాశం ఇస్తారని చెబుతున్నారు. కేటీఆర్ కు ఎప్పటిలానే ఐటీ రంగాన్ని ఇచ్చేస్తారని.. హరీశ్ కు మాత్రం ఇరిగేషన్ కాకుండా.. విద్యాశాఖను అప్పగించే అవకాశం ఉందంటున్నారు. శాఖ ఏదైనా కేటీఆర్.. హరీశ్ లకు మాత్రం మంత్రి పదవులు లభించటం ఖాయమంటున్నారు.
గత ప్రభుత్వంలో మహిళకు కేబినెట్ లో చోటు దక్కని నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం.. కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ కావటం తెలిసిందే. ఇందుకు భిన్నంగా ఈ సారి మాత్రం మహిళకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని చెబుతున్నారు. వైఎస్ కు చేవెళ్ల చెల్లమ్మగా సుపరిచితురాలైన సబితా ఇంద్రారెడ్డికి ఈసారి మంత్రి పదవిని ఇస్తారని చెబుతున్నారు.
ఇంతకాలం పక్కన పెట్టిన హరీశ్ కు ఈసారి మంత్రిపదవి కేటాయిస్తే.. ఆయన్ను అణగదొక్కేస్తున్నారన్న ప్రచారానికి పుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నారు. మరి.. అందరి అంచనాలకు తగ్గట్లే కేసీఆర్ కేబినెట్ విస్తరణకు నిర్ణయం తీసుకుంటారా? అన్నదిప్పుడు ఉత్కంటగా మారిందని చెప్పక తప్పదు.