తెలంగాణ‌కు కొత్త హోం మంత్రి వ‌స్తున్నారు..!

Update: 2016-05-25 14:01 GMT
రాష్ట్ర ప‌రిపాల‌నా వ్య‌వ‌హారాల్లో సీఎం త‌ర్వాతి స్థానం హోంమంత్రిది. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల నుంచి ఇత‌ర ముఖ్య‌మైన వ్య‌వ‌హారాల‌న్నీ చూసుకునే బాధ్య‌త ఆ ప‌ద‌విలో ఉండేవారిపై ఉంది. తెలంగాణ‌లో త్వ‌ర‌లో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌ర‌గ‌బోతోంది. అయితే ఇందులో భారీ మార్పులు జ‌ర‌గ‌బోతున్నాయ‌ని స‌మాచారం. ఇందులో కీల‌క‌మైన హోంశాఖ‌ను మార్చాల‌ని కేసీఆర్ యోచిస్తున్నార‌ట‌. ఇందులో భాగంగానే ఈ ప‌ద‌విని తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకి ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. పాలేరులో అఖండ మెజారిటీతో గెలిచి స‌త్తా చాటిన తుమ్మ‌ల నాగేశ్వ‌రావుకు మంత్రివ‌ర్గంలో ప్ర‌మోష‌న్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఇందుకు పాలేరు విజ‌యం ఒక్క‌టే కార‌ణం కాద‌ట‌. సీనియ‌ర్ నేత‌, మొద‌ట్నించీ కేసీఆర్ వెన్నంటి న‌డిచిన నాయినికి విశ్రాంతి ఇచ్చే అవ‌కాశం ఉందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అన్నింటినీ ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించి స‌రైన నిర్ణ‌యం తీసుకునే కేసీఆర్ ఇప్పుడు కూడా వ్యూహాత్మ‌కంగానే పావులు క‌దుపుతున్నారు. పాలేరులో ప్ర‌తిప‌క్షాల‌న్నీ క‌లిసి పోటీచేసినా.. టీఆర్ ఎస్ విజ‌యాన్ని ఆప‌లేక‌పోయాయి. ఇందులో తుమ్మ‌ల వ్యూహ‌చ‌తుర‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిందే! వీటితోపాటు క‌మ్మ కుల పెద్ద‌గా, తుమ్మ‌లకు  ఆంధ్రా పారిశ్రామిక‌వేత్త‌లు - సినీ ప్ర‌ముఖులతో స‌త్సంబంధాలున్నాయి. తెలంగాణ‌ - ఆంధ్రా స‌రిహ‌ద్దు రాజ‌కీయాల‌లో ఆరితేరిన తుమ్మ‌ల‌కు కీల‌క‌ప‌ద‌వి క‌ట్ట‌బెడితే, అటు ఆంధ్రా నుంచొచ్చే స‌మ‌స్య‌ల‌కు స‌మాధానం చూపించ‌గ‌ల‌డ‌ని, పార్టీకి అన్ని విధాలుగా వెన్నుద‌న్నుగా నిల‌వ‌గ‌ల‌డ‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌.

ఈనాడు - ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల యాజ‌మాన్యాల‌కు ఆంత‌రంగికుడిగా కూడా పేరొందారు. ఇక టీఆర్ ఎస్‌ కు అస్స‌లు ప‌ట్టులేని ఖ‌మ్మం జిల్లాలో ఆ పార్టీని ఓ రేంజ్‌ లో బ‌లోపేతం చేయ‌డంలో తుమ్మ‌ల మంత్రాంగం తిరుగులేనిది. తెలంగాణ‌లో కీల‌క శ‌క్తిగా ఉన్న ఆయ‌న‌కు ఉన్న‌త‌మైన‌, అత్యంత కీల‌క‌మైన హోం శాఖ ఇవ్వ‌డ‌మే స‌మంజ‌స‌మ‌ని కేసీఆర్ అనుకుంటున్నార‌ట‌. అన్నీ కుదిరితే, తుమ్మ‌ల హోంకు..నాయినిని ఇంటికి అంటే పార్టీ సేవ‌ల‌కు గులాబీ ద‌ళ‌ప‌తి పంపొచ్చ‌ని ప్ర‌చారం సాగుతోంది.
Tags:    

Similar News