భూములు కొనేవాళ్లకు షాకివ్వబోతున్న కేసీఆర్

Update: 2019-12-19 07:46 GMT
ఆర్థిక మాంద్యం చుట్టుముట్టింది. పన్నుల రాబడి తగ్గింది. ఖజానా ఖాళీ అవుతోంది. అందుకే సీఎం కేసీఆర్ కొత్త సంవత్సరం వేళ ఆదాయం సమకూర్చుకునేందుకు మద్యం ధరలను పెంచేశారు. కానీ అవి సరిపోనట్టు ఉన్నాయి. అందుకే తాజాగా భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచేందుకు రెడీ అయ్యారు..

సిద్ధిపేట లోని హుస్నాబాద్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని ఓ మారుమూల పల్లెలో బస్టాండ్ వద్ద గుంట స్థలం విలువ 12 లక్షలు పలికింది. దానికి రిజిస్ట్రేషన్ విలువ ఎంతో తెలుసా? కేవలం 23వేలు. 2013 ఆగస్టులో సవరించిన రిజిస్ట్రేషన్ విలువల ప్రకారం ఇంత తక్కువ మొత్తం ప్రభుత్వానికి పోతోంది. తెలంగాణలో భూముల ధరలు భారీగా పెరగాయి. పల్లెలు, పట్నాలు అనే తేడా లేకుండా ఐదారు రెట్లు పెరిగాయి. హైదరాబాద్ లో అయితే చుక్కలనంటున్నాయి. కానీ దానికి సరిపడా రిజిస్ట్రేషన్ విలువలు మాత్రం లేదు. దీంతో తెలంగాణ సర్కారుకు బొక్కపడుతోంది.

ఇక హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో గజం ధర ఏకంగా రూ.79వేలు పలుకుతోంది. అక్కడ రిజిస్ట్రేషన్ ధర మాత్రం కేవలం రూ.7వేలు మాత్రమే.  వ్యవసాయ భూములకు ఇదే ధర. దాదాపు 7 ఏళ్ల క్రితం నాటి   ప్రభుత్వానికి భారీగా గండిపడుతున్న భూ రిజిస్ట్రేషన్ విలువలను పెంచేందుకు కేసీఆర్ సర్కారు రెడీ అయ్యింది.

ఇటీవల కేంద్ర కేబినెట్ లో జీఎస్టీపై జరిగిన సమావేశంలో ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచడానికి నిర్ణయించింది. దీంతో తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే కసరత్తు చేసింది. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారం రోజుల్లోనే భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరిగే అవకాశం ఉంది.
Tags:    

Similar News