ఉద్యోగుల విషయంలో మొదటి నుంచి సానుకూలంగా ఉంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. వారి వేతన సవరణ విషయంలో (పీఆర్సీ)పై మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు ఇటీవలే కేసీఆర్ ను కలిసి పీఆర్సీ ప్రకటించాలని కోరారు. అయితే గడువును ఈ ఏడాది చివరి వరకూ ప్రభుత్వం పొడిగించి ఉద్యోగులకు షాకిచ్చింది.
పీఆర్సీని ఈ ఏడాది చివరి వరకూ పొడిగించి ఉద్యోగులను నిరాశపరిచిన కేసీఆర్ సర్కారు తాజాగా ఉద్యోగుల హౌస్ రెంట్ అలవెన్స్( హెచ్ఆర్ఏ)లో కూడా కోత పెట్టే దిశగా కసరత్తు చేస్తుండడం ఉద్యోగులను విస్మయానికి గురిచేస్తోంది.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ ఆర్ ఏను 30శాతం నుంచి 24శాతానికి తగ్గించింది. దీంతో అదే బాటలో తెలంగాణ ప్రభుత్వం కూడా తగ్గించాలని చూస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో ఉద్యోగుల పనిప్రదేశం బట్టి హెచ్ఆర్ఏలో 4 స్లాబులున్నాయి. దాన్ని హైదరాబాద్ లో 20శాతం, ఇతర ప్రాంతాల్లో 10శాతానికి తగ్గించాలని యోచిస్తోందట.. ఫిట్ మెంట్ తేలాక దీనిపై దీనిపై తుదినిర్ణయం తీసుకుంటుందట.. ఇదే జరిగితే పుండు మీద కారం చల్లినట్టు ఉద్యోగులు సమ్మెకు, ఆందోళనలకు శ్రీకారం చుట్టడం ఖాయంగా కనిపిస్తోంది.