ప్ర‌కాశ్ రాజ్‌ తో కేసీఆర్ ప్ర‌త్యేక భేటీ..

Update: 2018-03-27 05:24 GMT
దేశంలో గుణాత్మ‌క మార్పు రాజ‌కీయాలు రావాల‌ని - ఇందుకు కాంగ్రెస్‌ - బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాలు ఏర్పడాల‌ని పేర్కొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇందుకు త‌గిన క‌స‌రత్తులు చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని కోల్‌ క‌తా వెళ్లి మ‌రీ క‌లిసిన కేసీఆర్ త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు సైతం త‌గిన ముంద‌డుగుతో సాగుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా రాజకీయనాయకులతోపాటు సమాజాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న వివిధవర్గాల నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఆయా రంగాల్లో తీసుకు రావాల్సిన మార్పులపై ప్రముఖుల సూచనలు పరిగణనలోకి తీసుకోనున్నారు.

థ‌ర్డ్ ఫ్రంట్ చ‌ర్చ‌ల్లో భాగంగా దేశంలోని కవులు - కళాకారులు - రచయితలు - సినీ ప్రముఖులు - వివిధరంగాల నిపుణులతో సంప్రదింపులు జరుపాలని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే ఉత్తరాదికి చెందిన పలువురు కవులు, కళాకారుల జాబితాను సిద్ధంచేసినట్టు తెలిసింది. ఈ జాబితాలో ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌ రాజ్ ఉన్నట్టు సమాచారం. ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌ తో పాటు వ్యవసాయరంగంలోని ప్రముఖులను కూడా పార్టీ నేతలు సంప్రదిస్తున్నారు. వ్యవసాయంరంగంలో సమూలమార్పులు తేవడంలో వీరిని భాగస్వామ్యం చేయనున్నట్టు సమాచారం. టీఆర్‌ ఎస్ ఎంపీలకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించారని, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ ప్రక్రియలో వేగం పెంచనున్నట్టు తెలిసింది. ప్రముఖ నగరాల్లో సమావేశాలు ఏర్పాటుచేసినప్పుడు కవులు - రచయితలు - కళాకారులను, వివిధరంగాల నిపుణులను ఆహ్వానించి సలహాలు - సూచనలు స్వీకరిస్తారని తెలిసింది. ఏప్రిల్ నుంచి ఈ స‌మావేశాలు ఉంటాయ‌ని స‌మాచారం.
Tags:    

Similar News