ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే రాములోరి కల్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వారు తప్పనిసరిగా హాజరయ్యేవారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాల్ని స్వయంగా మోసుకుంటూ వెళ్లి.. ఆర్చకస్వాములకు అందించేవారు. అధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన రాములోరి కల్యాణాలకు ఆయన హాజరైంది తక్కువే.
భద్రాద్రి రాములోరి కల్యాణానికి కేసీఆర్ ఎందుకు హాజరు కారన్న దానికి ఇప్పటికి స్పష్టత లేదు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులకు భిన్నంగా ఆయన వ్యవహరించేవారు. తనకు బదులుగా రాష్ట్ర దేవాదాయ మంత్రిని పంపేవారు. అలా అని ఆ రోజున ఆయన మరేదైనా కార్యక్రమంలో బిజీగా ఉండేవారా? అంటే అది కూడా ఏమీ ఉండేది కాదు. ఇదే విషయాన్ని ఒకరిద్దరు నేతలు విమర్శించే ప్రయత్నం చేసినా.. అదేమీ వర్కువుట్ కాలేదు.
రోటీన్ కు భిన్నంగా ఈసారి భద్రాచలం ఆలయ వేద పండితులు సీఎం కేసీఆర్ ను స్వయంగా కలిశారు. ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రిని కలిసిన వారు.. స్వామివారి ప్రసాదంతో పాటు.. రాములోరి కల్యాణానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వానపత్రాన్ని అందించారు. మరి.. ఈసారైనా కల్యాణోత్సవానికి వెళతారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తుల్ని రాములోరి కల్యాణానికి ఆహ్వానించే వీలుంటుంది. ఇలాంటివేళ.. తాను వెళితే.. అనవసరమైన హడావుడి అవుతుందనన ఆలోచనతో ఆగిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు. అదే సమయంలో.. కల్యాణోత్సవానికి వెళ్లే అవకాశం కూడా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇటీవల కాలంలో కేసీఆర్ లో కొన్ని మార్పులు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఉప ఎన్నికలు.. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో.. ప్రతి విషయాన్ని తానే స్వయంగా చూసుకోవటం.. బహిరంగ సభను ఏర్పాటు చేసి దానికి వెళ్లటంతో పాటు.. గతంలో పట్టుదలతో వ్యవహరించిన విషయాల్ని సైతం వదిలేసి.. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఆయన నిర్ణయాల్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాములోరి పెళ్లికి హాజరైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. మరి.. కేసీఆర్ ఏం చేస్తారో తేలాలంటే ఈ నెల 21 వరకు వెయిట్ చేయక తప్పదు.