తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల ఏ కార్యక్రమంలో పాల్గొంటున్నా ఆయన వెనుక మనవడు హిమాంశు తప్పనిసరిగా కనిపిస్తున్నాడు. అది అధికారిక కార్యక్రమమైనా - రాజకీయ కార్యక్రమమైనా - సొంత పనులైనా కేసీఆర్ వెంట హిమాంశు ఉండాల్సిందేనట. తాజాగా మొన్న క్రైస్తవ సోదరుల కోసం నిర్వహించిన క్రిస్మస్ ఉత్సవాల్లోనూ హిమాంశ్ తన తాత వెంటే ఉన్నాడు. అంతేకాదు... కేసీఆర్ కూడా క్రిస్మస్ కేక్ కట్ చేసి తొలి ముక్క హిమాంశ్ నోటికే అందించారు. అక్కడున్న మత పెద్దలంతా ఆ తరువాతే. అధికార దర్పం - హడావుడి అన్నీ అలవాటు చేస్తేనే రాజకీయాల్లో రాణిస్తారన్న ఉద్దేశంతోనే కేసీఆర్ తన మనవడికి ఇప్పటి నుంచే తన వెంట తిప్పుకుంటూ తర్ఫీదు ఇస్తున్నారట.
అయితే... టీఆరెస్ శ్రేణులు మనవడిని చూసి ముచ్చట పడుతున్నా విపక్షాలు మాత్రం మాటలు విసురుతున్నాయి. హిమాంశ్ మనవడా.. లేకపోతే ఉపముఖ్యమంత్రా అని సెటైర్లు వేస్తున్నారు.
ఇంతకుముందు కేసీఆర్ అధికారిక నివాసం ప్రారంభోత్సవ కార్యక్రమంలో.. ఉబెర్ బైకుల ప్రారంభంలో.. ఇంకా అనేక కార్యక్రమాల్లో హిమాంశ్ పాల్గొన్నాడు. ఇప్పటికే కేసీఆర్ రాజకీయ వారసులుగా కేటీఆర్ - కవిత - హరిశ్ రావులు సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు నెక్స్టు జనరేషన్ ను కూడా రెడీ చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/