తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్.. ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ర్యాంకులివ్వడమే. ర్యాంకుల విషయంలో కేసీఆర్ స్ట్రాటజీ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. తనకు.. తన మేనల్లుడికి టాప్ ర్యాంకులిచ్చుకుని.. తన కొడుక్కి తక్కువ మార్కులు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే సమయంలో తనకు ఫేవర్ గా ఉన్న కొందరు బీజేపీ ఎమ్మెల్యేలకు ఎక్కువ మార్కులివ్వడం.. కాంగ్రెస్ పార్టీ నుంచి తన పార్టీలోకి లాగాలని భావిస్తున్న నేతల్ని కూడా మంచి మార్కులతో గౌరవించడం కూడా చర్చనీయాంశమే.
అందర్లోకి కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డికి వచ్చిన మార్కులే ఆవ్చర్యం కలిగిస్తున్నాయి. క్రితం సారి 45.7 మార్కులతో ఉన్న జానా రెడ్డి.. ఈ సారి ఏకంగా 63.2 మార్కులకు పెరిగారు. అలాగని ఈ మధ్య కాలంలో ఆయన నియోజకవర్గంలో కొత్తగా ఏమీ చేసింది లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొనడం లేదు. ప్రతిపక్షంలో కీలక నేత అయి ఉండి కూడా ఆయన టీఆర్ఎస్ పార్టీపై ఎలాంటి విమర్శలు చేయట్లేదు. ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనట్లేదు. మొత్తంగా ఆయన పనితీరు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ కేసీఆర్ ఆయనకు ఫస్ట్ క్లాస్ ఇచ్చేశారు. ఇదంతా జానాను తన పార్టీలోకి రప్పించడానికి వేసిన ఎత్తుగడగా భావిస్తున్నారు. రెడ్లందరూ తనకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నట్లు సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన అగ్ర నేతను తన పార్టీలోకి రప్పించడం కోసం కేసీఆర్ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. మరి జానా ట్రాప్ లో చిక్కుకుంటారో లేదో చూడాలి. ఈ సర్వే గురించి జానా దగ్గర ప్రస్తావిస్తే ఆయన లైట్ తీసుకున్నారు. ఇలాంటివి తాను పట్టించుకోనన్నారు. తాను ప్రజల్ని మాత్రమే నమ్ముతానని.. గతంలో తాను ఓడిపోతానంటూ సర్వే వచ్చినా.. ప్రజలు మాత్రం ప్రతిసారీ గెలిపించారని అన్నారు జానా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/