ఓ ఎత్తి పోతల పథకంతో తెలంగాణ దశనూ దిశనూ మార్చామని గర్వంగా చెబుతున్న కేసీఆర్ ఇదే తన అభివృద్ధి నమూనా (డెవలప్మెంట్ మోడల్) అని చెప్పుకునేందుకు,దేశ వ్యాప్తంగా తన సత్తా చాటుకునేందుకు దీనినే ఉపయోగించుకునేందుకు ఎక్కువ ఇష్టం చూపుతున్నారు.యాభై టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు అన్నది తెలంగాణ ప్రజల కలలను సాకారం చేయనుందని, సాగునీటి అవసరాలు పుష్కలంగా తీర్చి సేద్యంలో ధాన్యాగారంగా తెలంగాణ నిలిచేందుకు ఎంతగానో ఉపయోగపడనుందన్న విశ్వాసాన్ని కేసీఆర్ వ్యక్తం చేస్తున్నారు.
అందుకే దీన్నే ఒక మోడల్ పాయింట్ గా తీసుకుని వచ్చే ఎన్నికల్లో ప్రజల మధ్యకు వెళ్లాలని,దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ కింద మల్లన్న సాగర్ నే ఫోకస్ చేయాలని తలపిస్తున్నారు కేసీఆర్.ఇదే విషయమై పీకేకు కూడా ఇప్పటికే నిన్నటి వేళ ఫాం హౌస్ లో భేటీ అయిన వేళ ఓ స్పష్టత కూడా ఇచ్చారు.
తెలంగాణలో తాము చేపట్టిన అభివృద్ధినే ప్రధాన అజెండాగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది కేసీఆర్ వ్యూహం. అందుకు జాతీయ స్థాయి లో వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్ ను రంగంలో దింపుతున్నారు. అదే సమయంలో విలక్షణ నటుడు, మోడీ వ్యతిరేకిగా పేరున్న ప్రకాశ్ రాజ్ సమన్వయం కూడా అవసరం అని కేసీఆర్ బలీయంగా విశ్వసిస్తున్నారు.
అందుకే ప్రకాశ్ రాజ్ తో కలిసి నిన్నటి వేళ ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే మల్లన్న సాగర్ ను సందర్శించి వచ్చారు. అదేవిధంగా గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కూడా చూసి వచ్చారు.ముఖ్యంగా కేసీఆర్ ఆలోచన ఏంటంటే సాగునీటి రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన ఉంచామన్నది ఓ ప్రధాన అజెండాగా చేసుకుని వెళ్లాలని! మల్లన్న సాగర్ అన్నది దేశంలోనే అతి పెద్ద ఎత్తి పోతల పథకంగా పేరు తెచ్చుకుందని, దీని ద్వారా రానున్న కాలంలో 15 లక్షలకు పైగా ఆయకట్టుకు నీరందనుందని చెబుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూపొందిన ఈ ప్రాజెక్టుతో హైద్రాబాద్ మరియు సికింద్రాబాద్ వాసులకు తాగునీటి కష్టాలు కూడా తీరిపోనున్నాయని చెబుతున్నారు.దీనినే ప్రధానంగా తీసుకుని ప్రచారాస్త్రంగా మలచాలని, ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యంకానిది తమతోనే సాధ్యం అయిందని గోదావరి నీళ్లకు నడక నేర్పిన ఘనత తమదేనని ప్రచారం చేయాలని భావిస్తున్నారు.
అందుకే మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై అంత ప్రేమ కురిపిస్తున్నారు.దీంతో పాటు వ్యవసాయానికి నాణ్యతతో కూడిన ఉచిత విద్యుత్ ను కేంద్రం వద్దన్నా కూడా ఇస్తున్నామని చెబుతున్నారు.దీనిపై కూడా ఫోకస్ చేయాలని భావిస్తున్నారు. అంతేకాకుండా రైతు బంధు, కల్యాణ్ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలు దేశంలోనే ఆదర్శనీయం అయిన పథకాలు అని చాటింపు వేసేందుకే ప్రశాంత్ కిశోర్ ను రంగంలోకి దింపుతున్నారు అన్నది సుస్పష్టం.