తెలంగాణరాష్ట్ర ఉద్యమంలో కీలకమైన నిధులు.. నీళ్లు.. ఉద్యోగాల నినాదాల్లో తెలంగాణకు జరిగిన ద్రోహాన్ని ఎత్తి చూపిన అంశం సాగునీటి ప్రాజెక్టులగా చెప్పాలి. అపారమైన వనరులున్నా.. సీమాంధ్ర నేతలు దోపిడీ కారణంగా తెలంగాణ దారుణంగా నష్టపోయిందన్న వాదనకు తగ్గ ఆధారాల్ని చూపించటంలోనూ.. కేసీఆర్ మాటల తూటాలకు తన వాదనను నిలిపిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి రంగ సలహాదారు ఆర్ విద్యాసాగర్ రావు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఆయన..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆయన తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతగా పోరాడుతున్నది తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఈ మధ్యన ఆయన తీవ్ర అస్వస్థతకు గురై.. కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న ఆయన్ను పరామర్శించేందుకు పలువురు తెలంగాణ ప్రముఖులు ఆసుపత్రికి వస్తున్నారు. ఇదిలా ఉంటే.. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యాసాగర్ రావును పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా తనకెంతో ఆప్తుడు.. ముఖ్యుడైన విద్యాసాగర్ రావు బెడ్ మీద స్పృహలో లేకుండా ఉండటంతో కేసీఆర్ భావోద్వేగానికి గురైనట్లుగా తెలుస్తోంది.
అన్నా.. విద్యన్నా.. నేను కేసీఆర్ ను అన్నా.. వచ్చినా అన్నా.. అంటూ కేసీఆర్ నోటి నుంచి పలుకులకు విద్యాసారగ్ రావు శరీరం కాస్త స్పందించినట్లుగా చెబుతున్నారు. వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న ఆయన శరీరం.. ఎవరు మాట్లాడినా స్పందించని నేపథ్యంలో.. కేసీఆర్ మాటలకు రియాక్ట్ కావటం తీవ్ర భావోద్వేగ వాతావరణం ఏర్పడినట్లుగా చెబుతున్నారు.
కేసీఆర్ మాటలకు కాస్త స్పందించిన విద్యాసాగర్ రావు శరీరాన్ని చూసిన ఆయన సతీమణి.. ఏమండి.. సారొచ్చిండు.. కేసీఆర్ సారొచ్చిండు.. ఒక్కసారి చూడండి అంటూ పిలవగా.. మరోసారి ఆయన కాస్త కదలినట్లుగా తెలుస్తోంది. విద్యాసాగర్ రావుకు అందుతున్న వైద్యం గురించి ఆరా తీసిన కేసీఆర్.. అత్యుత్తమ వైద్య సేవల్ని అందించాల్సిందిగా కోరారు. తన మాటలకు విద్యాసాగర్ రావు శరీరం స్పందించిన తీరుపై కేసీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ఆయన త్వరగా కోలుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యాసాగర్ రావు కోలుకొని తిరిగి.. మామూలుపరిస్థితికి వచ్చేలా వైద్యం చేయాలని కోరినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ ఆకాంక్ష నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/