ప్రాణాంతక వైరస్ కరోనా గురించి ప్రపంచ దేశాలన్నీ హడలిపోతున్నాయి. వైరస్ ను నియంత్రించే క్రమంలో భారత్ కూడా ఇప్పటికే చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్ లో వైరస్ నిరోధక చర్యల విషయంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందున్నదని కేంద్రమే స్వయంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా కేంద్రం తీసుకుంటున్న చర్యలపైనా సంచలన కామెంట్లు చేశారు. విదేశాల నుంచి వస్తున్న వారి కారణంగానే దేశంలో వైరస్ వ్యాప్తి చెందుతోందన్న విషయం నిర్ధారణ అయిన నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇప్పటిదాకా ఎందుకు రద్దు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం కాస్తంత నిదానంగా చర్యలు ప్రారంభించిందన్న కేసీఆర్... తక్షణమే హైదరాబాద్ కు అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
మీడియా సమావేశంలో కేసీఆర్ ఏమన్నారన్న విషయానికి వస్తే... రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి వచ్చినవారికే కరోనా వైరస్ సోకిందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో కరోనా వచ్చివారు 14 మంది ఉన్నారని.. వారిలో 5 మంది విమానమార్గం ద్వారా - 9 మంది ఇతర మార్గాల్లో వచ్చారని చెప్పారు. మార్చి 1 తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వతహాగా అధికారులకు రిపోర్ట్ చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే వైరస్ వ్యాప్తిని నివారించవచ్చన్నారు. కరీంనగర్లో కరోనా సోకినవారు మత ప్రచారం కోసం వచ్చారని.. ప్రస్తుతం వారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ముందు జాగ్రత్తలు తీసుకోని దేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. దేవాలయాలు - మసీదులు - చర్చిలు - గురుద్వారాల్లోకి ప్రజలను అనుమతించవద్దని విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఉగాది - శ్రీరామనవమి ఉత్సవాలను రద్దు చేశామని తెలిపారు.
ఉగాది రోజున పంచాగ శ్రవణం లైవ్ టెలికాస్ట్ చేస్తామని కేసీఆర్ చెప్పారు. పట్టణాలు - గ్రామాల్లో శానిటైజేషన్ పెంచాలని మున్సిపల్ - గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. తెలంగాణలో 1125 మందిని క్వారంటైన్ చేశామని తెలిపారు. విదేశాలు నుంచి వచ్చినవారు తప్పకుండా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా హోమ్ క్వారంటైన్ వెళ్తామంటే పంపిస్తున్నామని.. అలాంటి వారిపై పూర్తి నిఘా ఉంటుందన్నారు. తెలంగాణ సరిహద్దుల్లో 18 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చేవారిని క్షుణంగా తనిఖీ చేస్తామన్నారు. పదో తరగతి పరీక్షలను యథాతథంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల పరీక్ష కేంద్రాలను హై శానిటైజ్ చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో సీసీఎంబీని వాడుకునేందుకు రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలని శుక్రవారం జరగనున్న వీడియో కాన్ఫరెన్స్ లో కోరనున్నట్టు తెలిపారు. ముందే ముహుర్తం కుదిరిన పెళ్లిలకు 200 మందిలోపే అతిథులు ఉండాలని.. రాత్రి 9 గంటలలోపు వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన ఫంక్షన్ హాల్స్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష అని కేసీఆర్ పేర్కొన్నారు.