సమీపిస్తున్న ఎన్నికల గడువు - పెల్లుబుకుతున్న అసంతృప్తుల నేపథ్యంలో తెలంగాణ భవన్ లో టీఆర్ ఎస్ పార్టీ అధినేత - తెలంగాణ అపద్ధర్మ సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మూడు గంటల పాటు సమావేశం కొనసాగింది. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారికి స్పష్టమైన హెచ్చరికలు జారీచేశారు. అభ్యర్థులెవరూ హైదరాబాద్ లో కనపడొద్దని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. టీఆర్ ఎస్ హయంలో చేసిన అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలను - ప్రజలకు పూర్తిస్థాయిలో తీసుకెళ్లేందుకు వ్యూహాలు రచించాలని స్పష్టం చేశారు. స్థానికంగా చేసిన అభివృద్ధిని - ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందిన వారి వివరాలను ప్రచారంలో ప్రస్తావించాలని అభ్యర్ధులకు సూచించారు.
ఇప్పటికే ప్రకటించిన 105 మంది అభ్యర్థులు - ఎంపీలతో 3 గంటలకు పైగా కొనసాగిన సమావేశంలో ప్రచార వ్యూహంపై కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. అభ్యర్థులను ప్రకటించి 45 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన ప్రచారం తీరును పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా తెలుసుకున్నారు. ఎన్నికల ప్రచారం - కార్యకర్తలు - నేతలతో సమన్వయం - ప్రజల మద్దతు తదితర అంశాలను సీఎం కేసీఆర్ అభ్యర్థులకు వివరించారు. దాదాపు 45 రోజుల ప్రచారం మిగిలి ఉన్న నేపథ్యంలో అభ్యర్థులకు ప్రచార సరళీ - పార్టీ అభ్యర్థులుగా అనుసరించాల్సిన వ్యూహాలను సమావేశంలో వివరించారు. ఇటీవల పార్టీ ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోపై అభ్యర్థుల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాల మేనిఫెస్టోను కాపీ కొట్టామన్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని కేసీఆర్ సూచించారు. 10 - 15 చోట్ల ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ సర్వే రిపోర్టులను చూపించారు. ప్రతి నియోజకవర్గంలోను అభ్యర్థుల బలాబలాలను ఆయన విడివిడిగా చర్చించారు. అభ్యర్థుల పరిస్థితిని సమీక్షించారు. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న అభ్యర్థులను కేసీఆర్ హెచ్చరించారు. ఈ 40 రోజుల పాటు అభ్యర్థులెవరూ హైదరాబాదులో కనిపించడానికి వీల్లేదని, నియోజకవర్గాల్లో ప్రచారాన్ని తీవ్రతరం చేయాలని హుకుం జారీ చేశారు.