కొన్ని రోజుల కిందట ఆర్టీసీ కార్మికులపై వరాల జల్లు కురిపించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇప్పుడు పేదలు - మధ్యతరగతి వర్గాలపైనా వరాల జల్లు కురిపించారు. భూములు ఉన్న పేదలు - మధ్యతరగతి ప్రజలు కట్టుకునే ఇళ్లకు సంబంధించి ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ చిన్న పక్కా ఇల్లు కట్టుకోవాలన్నా.. దానికి సంబంధించి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం - ప్లానింగ్ కోసం నెలల తరబడి వెయిట్ చేయడంతో పాటు భారీగా చేతులు తడపాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయా విషయాలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ టౌన్ ప్లానింగ్ నిబంధనలను పూర్తిగా సరళీకరించారు.
ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు - వెయిట్ చేసే సమయాన్ని సమూలంగా కేసీఆర్ మార్చేశారు. అదే సమయంలో ఉద్యోగుల బాధ్యతను మరింత గా పెంచారు. అక్రమార్కులపై కఠిన వైఖరి అవలంబిస్తామని ఆయన వెల్లడించారు. తాజాగా రాష్ట్రంలోని టౌన్ ప్లానింగ్ విధానం - నిబంధనలపై సంబంధిత మంత్రి - అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించి సంచలన నిర్ణయాలను ప్రకటించారు. అవేంటంటే..
+ ఇక నుంచి ఇల్లు కట్టుకోవాలనుకునే వ్యక్తి సులభంగా అత్యంత పారదర్శకంగా - వేగంగా భవన నిర్మాణ అనుమతులను పొందే విధంగా నూతన విధానం తీసుకురానున్నారు.
+ కొత్త విధానంలో.. 75 గజాల లోపు భవన నిర్మాణం చేపట్టే వారికి కేవలం రిజిస్ర్టేషన్ చేసుకుంటే సరిపోతుంది.
+ 600 గజాలలోపు భవన నిర్మాణాలకు సెల్ఫ్ డిక్లరేషన్ విధానం - 600 గజాలపైన భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులకు ఈ నూతన విధానం వీలు కల్పిస్తుంది.
+ ప్రజలు ఈ విధానాన్ని దుర్వినియోగం చేసి - తప్పుడు అనుమతులు తీసుకున్నా - అక్రమ నిర్మాణాలు చేపట్టినా వాటిని ఎలాంటి నోటీసు లేకుండ కూల్చే అధికారం నూతన పురపాలక చట్టంలో ఉంది.
+ కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలకు పూర్తి బాధ్యత అధికారులే వహించాల్సి ఉంటుంది.
+ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలపైనా వేగంగా - కఠినంగా వ్యవహరిస్తారు.
+ రూల్స్ ని ఉల్లంఘిస్తే ఏ స్థాయి అధికారులనైనా ఉపేక్షించరు.
+ కొత్త చట్టం ప్రకారం పురపాలక ఉద్యోగులు - పాలక మండళ్లపై నేరుగా కఠిక చర్యలు తీసుకునే వీలుంటుంది.
+ ప్రతి పురపాలికకు తప్పనిసరిగా మాస్టర్ ప్లాన్ ఉండాలి. రాష్ట్రంలో ఉన్న ఆరు పట్టణాభివృద్ధి సంస్థలు - హెచ్ యండిఏ విజయవంతంగా అనుసరిస్తున్న ల్యాండ్ పూలింగ్ వంటి పద్ధతులను అనుసరించాలి.