మరే ఇతర రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయాల్లో మాత్రం శాశ్విత శత్రుత్వం.. శాశ్విత మిత్రత్వం అన్నదే ఉండదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అప్పటివరకు బండ బూతులు తిట్టుకొని మరీ.. తర్వాత భాయ్ భాయ్ అంటూ హగ్గులు చేసుకోవటం రాజకీయాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఉప్పు.. నిప్పులా ఉండే వారిని సైతం ఇట్టే కలిపేసే మేజిక్ రాజకీయాల్లో కనిపిస్తుంటుంది. తాజాగా అలాంటి సీన్ కనిపించటంతో.. అక్కడున్న వారికి రాజకీయం రంగు ఎలా ఉంటుందో కనులారా చేసే భాగ్యం దక్కిందనునకోవాలి.
మోడీ మీదా.. ఆయన పరివారం మీదా నిప్పులు చెరుగుతూ సరికొత్తగా విరుచుకుపడుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాల పర్యటల్ని మాంచి జోరున చేస్తున్నారు. తాజాగా జనగామ కలెక్టరేట్ ను ప్రారంబోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం.. స్థానిక ఎంపీ కమ్ టీకాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరరెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎప్పటిలానే తన ప్రత్యర్థులను విమర్శలతోనూ.. ఘాటు వ్యాఖ్యలతో కాకుండా.. సమయస్ఫూర్తితో.. ఊహించని రీతిలో ఇచ్చే ట్రీట్ మెంట్ ను బోల్తా కొట్టిస్తుంటారు. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు.
కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేతలు మాత్రమే కాదు.. కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి కూడా హాజరయ్యారు. పూజ అనంతరం సీఎం చేతికి కొబ్బరికాయ కొట్టించాలన్న ఉద్దేశంతో ఆయనకు టెంకాయ ఇచ్చారు. అయితే.. ఆయన కొట్టకుండా తన పక్కనే ఉన్న ఎంపీ కోమటిరెడ్డికి ఇచ్చి కొట్టాల్సిందిగా కోరారు. ఆయన మొదట్లోనిరాకరించినా.. ఫర్లేదంటూ కేసీఆర్ మరోసారి కొబ్బరికాయ కొట్టాలని చెప్పటంతో.. కోమటిరెడ్డి కొబ్బరికాయ కొట్టేశారు.
మొదట్లో అంటీముట్టనట్లుగా ఉన్న కోమటిరెడ్డి.. టెంకాయ కొట్టాలన్న కేసీఆర్ మాటతో బాగానే ఇంప్రెస్ అయినట్లుగా కనిపించింది. ఆ తర్వాత జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ప్రశంసల జల్లు కురిపించిన కోమటిరెడ్డి.. తెలంగాణ వ్యాప్తంగా కొత్త కలెక్టరేట్లను సీఎం కట్టిస్తున్నారని.. కొన్ని రాష్ట్రాల్లో సెక్రటేరియట్ లను కూడా ఈ తీరులో నిర్మించలేదంటూ పొగిడేశారు. కరోనా కారణంగా రాష్ట్రానికి సరైన ఆదాయం రానప్పటికీ ప్రభుత్వం అన్ని రకాల పథకాల్ని కొనసాగిస్తుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఆయన కొన్ని వినతులు చేశారు.
జనగామకు మెడికల్.. పాలిటెక్నిక్ కాలేజీ ఇవ్వాలని.. చేర్యాలలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ రెండింటిని సీఎం తప్పకుండా ఇస్తారన్న నమ్మకం తనకుందన్న ధీమాను వ్యక్తం చేయటం ద్వారా అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. కోమటిరెడ్డి చేతికి కొబ్బరికాయ ఇవ్వటం ద్వారా కేసీఆర్.. ఆయన కెరీర్ ను భారీగానే దెబ్బ తీశారంటున్నారు. కొబ్బరికాయ చేతికి ఇచ్చి కోమటి రెడ్డి చేత కొట్టించటం ద్వారా.. కేసీఆర్ పై విమర్శనాస్త్రాల్ని సంధించాల్సిన ఆయన అందుకు భిన్నంగా పొగిడేశారు. ఎవరిని ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా కంట్రోల్ చేయాలో గులాబీ బాస్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి.