కేసీఆర్.. 'రైతు' సెంటిమెంట్ వ‌ర్క‌వుట‌య్యేనా? గ‌త పాఠాలు ఏంటి?

Update: 2022-12-15 04:12 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. జాతీయ రాజ‌కీయాల్లోకి అడుగులు వేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న జాతి మొత్తాన్ని.. సంతృప్తి ప‌రిచేలా రైతు సెంటిమెంటును.. అన్న‌దాత కాడిని భుజాన వేసుకున్నారు. భారీ ఎత్తున ఆయ‌న‌ను కొన్ని ప‌త్రిక‌లు భుజాన ఎత్తుకుని రైతు బాంధ‌వుడిగా పేర్కొన‌డం కూడా ఇప్పుడు చ‌ర్చ కు వ‌స్తోంది. దేశంలో రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు.. దీర్ఘ‌కాల స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారనే ఈ పార్టీ ద్వారా ప్ర‌జ‌ల‌కు చేర్చ‌నున్నారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, రైతు సెంటిమెంటు, అన్న‌దాత కార్డు.. జాతీయ రాజ‌కీయాల్లో ఏమేర కు ప‌నిచేస్తుంది?  ఎన్ని పార్టీలు.. ఎన్ని రాష్ట్రాలు ఈ సెంటిమెంటును అర్ధం చేసుకుంటాయి? అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. గ‌తంలోనూ జ‌న‌తా పార్టీ ఇదే  సెంటిమెంటుతో రాజ‌కీయాలు చేసింది. జాతీయ స్థాయిలో రాజ్య‌మేలింది. అయితే.. అన‌తి కాలంలోనే పుట్టి మునిగింది. అప్ప‌ట్లోనే జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ‌న్‌.. రైతుల సెంటిమెంటుతోనే జాతీయ రాజ‌కీయం చేశారు.

అప్ప‌ట్లో కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు.కానీ, త‌ర్వాత కాలంలో ప్ర‌జ‌లు జ‌న‌తా పార్టీని ఆద‌రించ‌లేకపో యార‌నే విష‌యం ఆస‌క్తిగా ఉంది. అదేవిధంగా నేష‌న‌ల్ ఫ్రంట్ కూడా అధికారంలోకి వ‌చ్చింది.

ఇది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న విధంగా.. రైతు స‌మ‌స్య‌ల‌ను ప్రామాణికంగా తీసుకుని ముందుకు సాగింది. అయితే.. ఇది కూడా ఎక్కువ కాలం దేశాన్ని పాలించ‌లేక పోయింది. దీనికి కార‌ణం..  దేశం మొత్తాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. భిన్న‌మైన స‌మ‌స్య‌లు ఉన్నాయి.

అన్న‌దాత స‌మ‌స్య‌లు అందులో ఒక భాగంగా మాత్ర‌మే ఉన్నాయి. వ్య‌వ‌సాయాధారిత దేశ‌మే అయిన‌ప్ప టికీ.. పారిశ్రామికంగా, ప్ర‌స్తుతం ఐటీ ప‌రంగా కూడా దేశానికి అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి.

జాతీయ‌స్థాయిలో రాణించాలంటే..కేవ‌లం ఒక స‌మ‌స్య‌ను ప్రామాణికంగా తీసుకుని ముందుకు సాగ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం త‌క్కువ‌గా ఉంటుంద‌నేది విశ్లేష‌కుల భావ‌న‌. రైతు స‌మ‌స్య మంచిదే అయినా.. నేడు ప్ర‌ధానంగా ఉపాధి, ఉద్యోగ‌, ద్ర‌వ్యోల్బ‌ణం, ధ‌ర‌లు.. వంటి స‌మ‌స్య‌లు దేశాన్ని ప‌ట్టిపీడిస్తున్నాయి. వీటికి కూడా త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోతే.. పెద్ద‌గా రాణింపు ఉండ‌ద‌నేది వీరి భావ‌న‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News