తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు రాజకీయ మౌనాన్ని ఆశ్రయించారు. పది రోజులుగా మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గడిపిన కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నప్పటికీ కీలక పరిణామాలపై ఆయన మౌనం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ వ్యాఖ్యలతో పాటు ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూర్యపేట బహిరంగసభలో చేసిన వ్యాఖ్యలు, నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించి విషయాలపై సీఎం కేసీఆర్ పల్లెతు మాట మాట్లాడలేదు. ఆయన స్పందించకపోవడంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.
ఈ నెల 3 నుంచి నేటి వరకు రెండు - మూడు రోజులు మినహాయిస్తే మిగిలిన పది రోజుల పాటు సీఎం కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలోనే గడిపారు. పైగా రాష్ట్రంలో ఇటీవల తీవ్రస్థాయిలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయినా ముఖ్యమంత్రి ఎలాంటి స్పందనను కనబర్చలేదు. పైగా మౌనాన్ని పాటిస్తున్నారు. కోదండరాం వ్యాఖ్యలపై కేవలం మంత్రులు మాత్రమే స్పందిస్తూ ఆయా వ్యాఖ్యలను ఖండించారు. అయితే కేసీఆర్ మౌనం పలు రాజకీయ పరిణామాలకు వేదికవుతుందనే అభిప్రాయాలుంటాయి. ఈ సారీ మౌనం వెనుక కూడా అనేక రాజకీయ పరిణామాలున్నాయనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరేం అనుకున్నా... ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాత్రం తన శైలి నుంచి కొంచెం కూడా వెనుకకు చూడకుండా వుండడంలో ఆయనకు సాటి మరోకరు లేరు. ప్రధానంగా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశం కొలిక్కి రాలేదు. పైగా దీనిపై రకరకాల కథనాలు ప్రచారంలో సాగుతున్నాయి.
ఇప్పటి వరకు ఎన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే పరిధుల విషయంలో స్పష్టత లేదు. ఈ నేపథ్యంలోనే దీనిపై గూగుల్ మ్యాపులే ఆధారంగా జిల్లాలతో పాటు మండలాల సరిహద్దులకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు మంత్రివర్గ విస్త రణకు సంబంధించిన అంశాలపై కసరత్తు జరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావంతో పాటు టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగి రెండేళ్లు పూర్తయ్యింది. ఇటీవల టీఆర్ ఎస్ రెండేళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించింది. మూడవ యేటా అడుగుపెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం మరింత విసృత్తంగా ప్రజా సంక్షేనికి కృషి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో మార్పు లు చేర్పులు చేసేందు కు తగిన చర్యలు తీసుకుంటున్నారని ఊహాగానాలు సాగుతున్నాయి.