జగన్ కు జైకొట్టిన బాబు సన్నిహితుడు

Update: 2019-12-18 10:40 GMT
ఏపీకి మూడు రాజధానులు అవసరం అంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనకు మద్దతు వెల్లువెత్తుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుయాయులు, మీడియా ఈ నిర్ణయంపై దుమ్మెత్తి పోస్తుండగా మిగతా వారు, పార్టీలు స్వాగతిస్తున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, మాజీ డిప్యూటీ సీఎం అయిన కేఈ కృష్ణమూర్తి తాజాగా ఏపీకి 3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించారు. కర్నూలులో జ్యూడిషియల్ రాజధానిని ప్రకటించడంపై కేఈ హర్షం వ్యక్తం చేశారు.

సీమ బిడ్డలుగా మొదటి నుంచి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని కేఈ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే తాము కోరామని.. వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధికి అవకాశం ఉందని జగన్ కు  కేఈ మద్దతు పలికారు.

ఇక కేఈనే కాదు..  ఉత్తరాంధ్రకు చెందిన బలమైన టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు తమ ప్రాంతానికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపి టీడీపీలో దుమారం రేపారు.

ఇలా చంద్రబాబు, కొందరు టీడీపీ నేతలు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే సీమ, ఉత్తరాంధ్రకు దిగ్గజ టీడీపీ నేతలు మాత్రం జగన్ నిర్ణయానికి మద్దతిస్తూ చంద్రబాబును ఇరకాటం నెట్టేశారు.
Tags:    

Similar News