వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జీ చెరకులపాడు నారాయణ రెడ్డి హత్య విషయంలో డిప్యూటీ సీఎ కేఈ క్రిష్ణమూర్తి స్పందించారు. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా కత్తులు - కొడవళ్లు - రాళ్లతో దాడి చేసి నారాయణరెడ్డిని హతమర్చిన ఘటన కలకలం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి కేఈకి హస్తముందని ఆరోపించారు. దీంతో విజయవాడలో తాజాగా మీడియాతో మాట్లాడిన కేఈ...ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారాయణ రెడ్డి హత్యకు, తనకు ఎలాంటి సంబంధం లేదన తేల్చిచెప్పారు. అంతేకాదు ఈ సందర్భంగా నారాయణరెడ్డిపై కేఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.నారాయణ రెడ్డికి చాలా మంది శత్రువులు ఉన్నారని అందులో భాగంగా ఇలా జరిగి ఉంటుందని వ్యాఖ్యానించారు.
నారాయణ రెడ్డి హత్య విషయంలో కావాలనే తన మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వాపోయారు. హత్యా రాజకీయాలు ప్రోత్సహించే సంస్కృతి తనది కాదని చెప్పిన కేఈ ఎవరు హత్య చేశారో పోలీసుల విచారణలో తేలుతుందని అన్నారు. తానెప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని కేఈ అన్నారు. అక్రమ మైనింగ్ కు సంబంధించి తన కుమారుడి పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు. ఆ కేసుకు సంబంధించి విచారణ హైకోర్టులో పెండింగ్ లో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌పై ఆరోపణలు గుప్పించారు. వైఎస్ జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని కేఈ వ్యాఖ్యానించారు.