నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలుపుకోసం అధికార తెలుగుదేశం పార్టీ చెమటోడుస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు - ప్రజల ప్రస్తుత మూడ్ ను తెలియజెప్పే ఎన్నికగా విశ్లేషకులు భావిస్తున్న ఈ ఉప పోరులో అధికార పార్టీ నేతలు గెలుపుకోసం `అన్నిదారులను` ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ఆ నేతలను అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ అధినేత - సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమైన కుప్పంను ఉదహరిస్తున్నారు. డిప్యూటీ సీఎం - కేఈ కృష్ణమూర్తి - నంద్యాల పార్లమెంటు ఇన్ చార్జి అయిన మంత్రి కాలవ శ్రీనివాసులు తాజాగా ఇదే అభివృద్ధి మంత్రం జపించారు. తాజాగా ఈ ఇద్దరు మంత్రులు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం తరహాలో నంద్యాల అభివృద్ధి జరుగబోతుందని జోస్యం చెప్పారు. నంద్యాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఇప్పటికే రూ.1200 కోట్లు నిధులు మంజూరు చేశారని, అభివృద్ధిని చూసి నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని ఆశీర్వదించాలని అభ్యర్థించారు. టీడీపీ గెలవడం ద్వారానే నంద్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
దివంగత నేత భూమానాగిరెడ్డి ఆశయ సాదన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నంద్యాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. నిధులు అడిగిన వెంటనే మంజూరు చేస్తున్నారని, అభివృద్ధి ఫలాలు పేద, మధ్యతరగతి ప్రజలకు ఖచ్చితంగా అందేవిధంగా ప్రణాళికాబద్ధంగా అధికారులు పనిచేయాల్సి ఉందన్నారు. కుప్పం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తరచుగా వెళ్లకపోయినా, ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా నిధులను ఖర్చుచేస్తూ రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడం వల్లనే ఆయన ఎన్నికల్లో నిలిచిన ప్రతిసారి అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారన్నారు. అదే రీతిలో నంద్యాలను సైతం అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. గతంలో ఎన్ టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలను అభివృద్ధి చేసేందుకు ఆదరణ పథకం ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఇప్పుడు కూడా అదే పథకాన్ని నంద్యాలలో అమలు చేస్తామన్నారు. ఎస్సీ - ఎస్టీ - బిసి - మైనార్టీలకు అన్ని రకాలుగా ఆదుకుంటామని, వారి సామాజిక అంశాలకు, వ్యక్తిగత అభివృద్ధికి కూడా టిడిపి బాసటగా నిలుస్తుందన్నారు.నంద్యాలలో ముస్లిం మైనార్టీ - బలిజ - వైశ్య - గౌడ - వాల్మీకి కులాల వారిగా సభలు పెట్టాలని, ఆయా సంఘాల నాయకులు తమపై ఒత్తిడి తెస్తున్నారని, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నంద్యాలలో సభలు ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ వారికి చేయబోయే సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పిస్తామని మంత్రులు తెలిపారు.
నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ న్యాయబద్ధంగా ఎన్నిక జరుపుతుందని ఎలాంటి అక్రమాలకు తావులేకుండ నిజాయితీగా తాము చేసిన అభివృద్ధిని చూపి ఓటు అడుగుతామన్నారు. ఈ నెల 13 - 14 తేదీల్లో నారా లోకేష్ నంద్యాల - కర్నూలు పర్యటనలో పాల్గొంటారని, ఆయన పర్యటనలో నంద్యాలకు మరిన్ని నిధులు అందే అవకాశం ఉందన్నారు. జిల్లాలో వక్ఫ్ - దేవాదాయ భూములు - అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండ చూడడంతోపాటు, ఇప్పటికే కబ్జా అయిన భూములను కాపాడేందుకు చర్యలు చేపడతామని ఉపముఖ్యమంత్రి కేఈ తెలిపారు. అన్నారు. ముస్లిం మైనార్టీల కోసం అటు కడప జిల్లా, ఇటు కర్నూలులో హజ్ హౌస్ లు నిర్మిస్తున్నామని, ఓర్వకల్లులో ఉర్దూ యూనివర్శిటీ ఇప్పటికే పనిచేస్తోందని తెలిపారు. ముఖ్యంగా నంద్యాలలో ముస్లిం మైనార్టీల కోసం ఉర్దూ డిగ్రీ కళాశాలను ప్రారంభించబోతున్నట్లు స్థానిక మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. అలాగే నంద్యాలలో ముస్లిం మైనార్టీల శ్మశాన వాటికను అభివృద్ధి చేయడంతోపాటు మసీదులకు, మదరసాలకు నిధులు అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే దుల్హన్ పథకం కింద రాష్ట్రంలోనే జిల్లా ఎక్కువగా లబ్ధి పొందిందని, ముస్లింలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందజేసేందుకు కృషి చేస్తామన్నారు. ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా చదువుకున్న యువతకు రుణాలు అందజేసి ఆర్థికంగా నిలదొక్కుకొనేలా కృషి చేయడంతోపాటు, విద్యార్థులకు నైపుణ్యతను పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. నంద్యాల అభివృద్ధి కోసం తమకే మద్దతు ఇవ్వాలని కోరారు.