ఏపీ డిప్యూటీ సీఎం(ఈ సంగతి ఆయన కూడా మర్చిపోయారేమో) కేఈ కృష్ణమూర్తి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో నేరుగానే విమర్శలు చేసిన కేఈ ఆ తరువాత వివిధ అనుభవాల నేపథ్యంలో బహిరంగ విమర్శలు మానుకున్నారు. చాలాకాలంగా ఆయన సైలెంటుగానే ఉన్నారు. తాజాగా మరోసారి ఆయన చంద్రబాబు తీరుపై పరోక్ష విమర్శలు కురిపించారు. ఎన్టీఆర్ కాలం వేరు చంద్రబాబు కాలం వేరు.. టీడీపీలో నేతలకు ఎన్టీఆర్ టైంలో ఉన్నట్లుగా గుర్తింపు లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
తాను ఎన్టీఆర్ కు చాలా సన్నిహితంగా ఉండేవాడినని, నాలుగేళ్లు నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశానని చెప్పారు. ఎన్టీఆర్ ముక్కుసూటి మనిషి అని.. ఇప్పుడున్న బాసు మాత్రం చాలా ఎక్కువగా ఆలోచన చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
కర్నూలు జిల్లాకు వెయ్యి మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు వచ్చిందని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. కానీ అది ఎప్పుడు వస్తోందో తెలియడం లేదన్నారు. జిల్లాకు పరిశ్రమలు ఎప్పుడొస్తాయని ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని కేఈ చెప్పారు. కొందరు జిల్లాలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొస్తున్నా ఎందుకో ఆలస్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు కర్నూలు జిల్లాలో శంకుస్థాపనలకు రావడం లేదని… వస్తే ఏం అడుగుతారోనన్న భయం బహుశా చంద్రబాబులో ఉండవచ్చన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/