ఏపీ రాజకీయాల్లో కాస్త చిత్రమైన సన్నివేశాలు మా జోరుగా సాగుతున్నాయి. అధికార.. విపక్ష అధినేతలిద్దరూ ఎవరికి వారు..తమ ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నారు. పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న జగన్ పార్టీ ఎమ్మెల్యేల్ని సైకిల్ ఎక్కించేందుకు సిద్ధం అవుతుంటే.. బాబు స్పీడ్ కు బ్రేకులు వేసేందుకు.. ఆయన్ను అయోమయానికి గురి చేసేందుకు జగన్ ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగా.. తమ పార్టీలోకి వచ్చేందుకు అధికారపక్ష ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని.. తాను ఒక్క పిలుపు ఇస్తే గంట వ్యవధిలో బాబు సర్కారు కూలిపోతుందంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ కు నిజంగా అంత సీన్ ఉందా? అన్న విషయంపై ఆసక్తికర చర్చ ఓపక్క జరుగుతుంటే.. మరోవైపు ఏపీ అధికారపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జగన్ మాటల్ని తిప్పికొట్టే ప్రయత్నంతో.. ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తమ పార్టీలోకి జగన్ పార్టీ నేతలు సంప్రదిస్తున్నారని చెప్పుకొచ్చారు. జగన్ ఎలా అయితే తమను టీడీపీ నేతలు సంప్రదిస్తున్నారని చెప్పారో.. అదే తీరులో కేఈ సైతం చెబుతున్నారు. మరో చిత్రమైన అంశం ఏమిటంటే.. మీ పార్టీలోకి రావాలనుకుంటున్న జగన్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఆ లెక్క చెప్పనన్న కేఈ.. జగన్ చెప్పినంత సంఖ్యలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నట్లుగా పేర్కొనటం గమనార్హం. ఇప్పటివరకూ చాలా రకాల కాపీలు చూశాం కానీ.. ప్రత్యర్థి పార్టీ అధినేత డైలాగును సేమ్ టు సేమ్ కాపీ కొట్టిన ఘనత మాత్రం కేఈకే దక్కుతుందేమో..?