ఏ వ్యూహంతో తాను నష్టపోయానో.. అదే వ్యూహాన్ని మరోచోట అమలు చేయటం ద్వారా లబ్థి పొందటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవంతం అయ్యారని చెప్పక తప్పదు. తెలంగాణ ముఖ్యమంత్రి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా తెలంగాణలో పార్టీ పరిస్థితి క్వశ్చన్ మార్క్ లా మారిన పరిస్థితి నెలకొని ఉంటే.. అదే ఆపరేషన్ ఆకర్ష్ ను తాను అధికారం ఉన్న ఏపీలో అమలు చేయటం ద్వారా రోజురోజుకీ మరింత బలాన్ని పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే పలువురు విపక్ష నేతలకు పార్టీ తీర్థం ఇవ్వటం ద్వారా తన రాజకీయ ప్రత్యర్థికి చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నారని చెప్పక తప్పదు.తాజాగా ఉగాది రోజున మరో జగన్ పార్టీ ఎమ్మెల్యేను సైకిల్ ఎక్కించేందుకు రంగం సిద్ధం చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఏపీ ఉప ముఖ్యమంత్రి తాజాగా చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఎంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చినా తమ పార్టీలో చేర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తేల్చి చెబుతున్నారు.
పార్టీలోకి వచ్చిన వారందరికి పదవులు పక్కా అని హామీ ఇస్తున్నారు. ప్రత్యర్థి పార్టీని నామరూపాల్లేకుండా చేయటమే తమ లక్ష్యమన్నది ఆయన మాటలు చెప్పకనే చెప్పేస్తున్నాయి. జగన్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. ఏ స్థాయి క్యాడర్ వారైనా సైకిల్ ఎక్కే వీలుందని చెబుతున్నారు. కేఈ మాటలు చూస్తుంటే.. ఆపరేషన్ ఆకర్ష్ ను నాన్ స్టాప్ గా అమలు చేయటమే లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది.